HomeLife StyleLongest Train Route: ప్రపంచంలోనే పొడవైన ట్రైన్ జర్నీ – 21 రోజులు, 13 దేశాలు!

Longest Train Route: ప్రపంచంలోనే పొడవైన ట్రైన్ జర్నీ – 21 రోజులు, 13 దేశాలు!

Longest Train Route: ట్రైన్ ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం. సాధారణంగా రెండు నుంచి మూడు రోజుల వరకు కొనసాగే ట్రైన్ రూట్స్ మన దేశంలో ఉన్నాయి. కానీ ప్రపంచంలోనే అతి పొడవైన ట్రైన్ జర్నీ గురించి తెలుసా? ఇది మొత్తం 21 రోజులు పాటు సాగుతూ, 13 దేశాల గుండా ప్రయాణిస్తుంది.

రూట్ వివరాలు
ఈ లాంగెస్ట్ రైలు ప్రయాణం పోర్చుగల్‌లోని అల్గార్వే నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, బెలారస్, రష్యా, మంగోలియా, చైనా, వియత్నాం, థాయిలాండ్, మలేషియా గుండా వెళ్లి చివరగా సింగపూర్ లో ముగుస్తుంది.

ఈ జర్నీలో మొత్తం 18,755 కిలోమీటర్ల దూరం కవర్ అవుతుంది. అంటే, మీరు పోర్చుగల్‌లో రైలు ఎక్కితే, చివరి స్టేషన్ అయిన సింగపూర్ చేరడానికి మూడువారాలు పడుతుంది. ఈ ప్రయాణంలో పారిస్, మాస్కో, బీజింగ్, బ్యాంకాక్ లాంటి వరల్డ్ ఫేమస్ నగరాలను ట్రైన్ విండో నుంచి ఎంజాయ్ చేయవచ్చు.

ఖర్చు ఎంత?
ఇంత పెద్ద జర్నీ అంటే ఖర్చూ చాలా ఎక్కువ అనుకుంటారు. కానీ ఈ ప్రయాణానికి టికెట్ ధర కేవలం 1,350 డాలర్లు (దాదాపు ₹1.13 లక్షలు) మాత్రమే. అంటే ఒక లక్షలోపే 13 దేశాలను రైల్లో కవర్ చేసే అవకాశం! పైగా సీట్లు, బెడ్స్, టైమ్‌కి ఫుడ్ వంటి బెస్ట్ ఫెసిలిటీస్ అందిస్తారు.

ఎవరు వెళ్ళవచ్చు?
అడ్వెంచర్ జర్నీలను ఇష్టపడేవాళ్లకు ఈ లాంగెస్ట్ ట్రైన్ రూట్ మస్ట్-ట్రై. కానీ వెళ్లే ముందు తగిన వీసాలు మరియు ఇతర వెరిఫికేషన్లు చేసుకోవాలి.

👉 మొత్తానికి, 21 రోజుల పాటు కొనసాగే ఈ అద్భుతమైన ట్రైన్ జర్నీ ఒక్కసారి జీవితంలో తప్పనిసరిగా అనుభవించదగ్గదే!

ఇవీ చదవండి: Portugal : పోర్చుగల్‌లో ఘోర విషాదం.. లిస్బన్‌లో గ్లోరియా ఫునిక్యులర్‌ రైలు ప్రమాదం
Train Journey: రైలు ప్రయాణంలో హెల్త్ ఎమర్జెన్సీ? ఈ నంబర్‌కు కాల్ చేయండి!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు