HomeNationalTrain Journey: రైలు ప్రయాణంలో హెల్త్ ఎమర్జెన్సీ? ఈ నంబర్‌కు కాల్ చేయండి!

Train Journey: రైలు ప్రయాణంలో హెల్త్ ఎమర్జెన్సీ? ఈ నంబర్‌కు కాల్ చేయండి!

Train Journey: మనలో చాలా మంది నిత్యం రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటాం. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైళ్లలో ప్రయాణించే సామాన్యుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే, రిజర్వేషన్ చేసుకున్న వారికి జరిగినంత సాఫీగా జనరల్ బోగీల్లోని ప్రయాణికులకు ప్రయాణం జరగడం లేదు. ఆ విషయం పక్కన పెడితే, రైల్లో ప్రయాణించే సమయంలో కొందరికి మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రయాణం చేసేటప్పుడు కొందరి ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. ఇలాంటి ఆపద సమయంలో ఏం చేయాలో పాలుపోదు. రైలులో ప్రయాణించేటప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే, మీకు అత్యవసర పరిస్థితుల్లో సహాయపడే ఓ నంబర్ ఉంది. రైల్లో వెళ్తున్నప్పుడు అనారోగ్యంగా అనిపించినా, మరే ఇతర శారీరక ఇబ్బందులు తలెత్తినా మీరు 139 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా తక్షణ సాయం పొందచ్చు.

రైల్లో ప్రయాణించే ప్యాసింజర్ ఆరోగ్యం క్షీణించిన తర్వాత సదరు వ్యక్తికి వైద్యం అందక మృతి చెందిన ఘటనలు మనం అప్పుడప్పుడూ వార్తల్లో చూస్తుంటాం. కానీ, ప్రయాణ సమయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. ప్రయాణికులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు రైల్వే శాఖ అనేక ఫెసిలిటీస్ అందిస్తోంది.

టీటీఈని సాయం కోరవచ్చు
139 నంబర్ కి కాల్ చేయడంతో పాటు టీటీఈకి మీరు లేదా ఎవరైనా ప్రయాణికుల అనారోగ్య సమస్యల గురించి సమాచారం అందించవచ్చు. టీటీఈ దగ్గర ప్రయాణికులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం చేసేందుకు వీలుంటుంది.

ఎక్స్ లో హెల్ప్ అడగవచ్చు
ఎక్స్ (X Twitter)ని ఎలా ఉపయోగించాలో తెలిసినట్లయితే, మీరు భారతీయ రైల్వేలు, రైల్వేలు లేదా IRCTCని ట్యాగ్ చేసి, మీ PNR సమాచారాన్ని అందించడం ద్వారా ఉన్నతాధికారులు స్పందించి సాయం అందించే వీలుంటుంది. ఇక రైల్లో ప్యాసింజర్ అనారోగ్యానికి గురైతే.. మీరు 139కి కాల్ చేసి మందులు అడగవచ్చు. 58 కంటే ఎక్కువ రకాల మెడిసిన్స్ రైల్వే అధికారుల వద్ద ఉంటాయి. అంతేకాకుండా రైల్వే ప్రయాణికులు డాట్ ఇన్ యాప్‌కి వెళ్లి కూడా హెల్ప్ కోరి సాయం పొందవచ్చు.

ఇవీ చదవండి: Rail Ticket: మీకు తెలుసా? రైల్లో ఒంటరి మహిళకు టికెట్ లేకున్నా పర్వాలేదు!
Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు భారీ షాక్..
Black Rice: బ్లాక్ రైస్ తింటే గుండె ఆరోగ్యం మెరుగవుతుందని మీకు తెలుసా?
Mobile Theft: మొబైల్ ఫోన్లు కొట్టేయటానికి శిక్షణ.. ట్రైనింగ్‌ పూర్తి చేసుకుంటే రూ.25 వేల జీతం..! గుట్టు రట్టయ్యిందిలా..!
Weight Loss Foods: బరువు తగ్గిపోవాలా? ఈ ఆహారాలను తినకండి!!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు