HomeNationalViral video: నీటి ట్యాంక్ ఎక్కిన ఎద్దు.. పోలీసులకు తిప్పలు.. ఊహించని ట్విస్ట్!

Viral video: నీటి ట్యాంక్ ఎక్కిన ఎద్దు.. పోలీసులకు తిప్పలు.. ఊహించని ట్విస్ట్!

Viral video: మన దేశంలో అప్పుడప్పుడూ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు నీటి ట్యాంకులు లేదా సెల్‌ టవర్లు ఎక్కిన సంఘటనలు చూస్తూనే ఉంటాం. కానీ రాజస్థాన్‌లో జరిగిన ఒక వింత సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అజ్మీర్ జిల్లా టంకావాస్ గ్రామంలో ఒక ఎద్దు ఏకంగా 60 అడుగుల ఎత్తైన నీటి ట్యాంక్ పైకి ఎక్కి అందరినీ షాక్‌కు గురి చేసింది.

ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ట్యాంక్ మెట్లపై నల్లటి ఎద్దు ఎక్కి నిలబడి ఉండటం స్పష్టంగా కనిపించింది. గ్రామస్తులు ఆ దృశ్యం చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

రెస్క్యూ బృందం ఎద్దు దగ్గరికి చేరుకునే ప్రయత్నం చేసినప్పుడు అది భయపడి కిందికి దూకేలా ప్రవర్తించింది. దీంతో అధికారులు వెంటనే ఆపరేషన్‌ను ఆపి, జంతువు భద్రత కోసం వెనక్కి తగ్గారు. తర్వాత భారీ క్రేన్ సహాయంతో ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికి చీకటిగా ఉండటంతో ఆ ప్రయత్నం మరుసటి రోజు వరకు వాయిదా పడింది.

అయితే, ఆశ్చర్యకరంగా రెస్క్యూ ఆపరేషన్ మొదలయ్యేలోపే ఎద్దు తనంతట తానే ట్యాంక్ నుంచి సేఫ్‌గా దిగిపోయింది. చివరికి పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన క్రేన్ ఆపరేషన్ అవసరమే రాలేదు. ఎద్దు ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోవడంతో గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ వింత సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇవీ చదవండి: Viral video : సముద్రంలో అగ్నిపర్వతం పేలుడు.. షాకింగ్ వీడియో!
Indian Woman Begging : ఏమీటీ దుర్గతి? కెనడాలో భారత యువతి భిక్షాటన? వీడియో వైరల్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు