Viral video : ఇటలీలోని ప్రసిద్ధ మౌంట్ స్ట్రోంబోలి అగ్నిపర్వతం భారీ విస్ఫోటనంతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ సంఘటనను సమీపంలో పడవలో ప్రయాణిస్తున్న నావికులు కెమెరాలో బంధించగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
వీడియోలో అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలిపోవడంతో, సముద్రంలో అలలు బలంగా ఎగిసిపడుతున్న దృశ్యం భయానకంగా కనిపిస్తుంది. బూడిద మబ్బులు ఆకాశాన్ని పూర్తిగా కప్పేసి, అణు బాంబు పేలుడిని తలపించే దృశ్యం కనిపించింది. పడవలో ఉన్నవారు ప్రాణాలను కాపాడుకోవడానికి వేగంగా అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు.
ఈ మౌంట్ స్ట్రోంబోలి అగ్నిపర్వతం సుమారు 2 లక్షల ఏళ్ల పురాతన చరిత్ర కలిగినదిగా భావిస్తారు. ప్రపంచంలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటిగా ఇది గుర్తించబడింది. అయితే ఈ విస్ఫోటనంలో ఎవరైనా గాయపడ్డారా లేదా అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు.
ఈ 28 సెకన్ల వీడియోను ట్విట్టర్‌లో @AMAZlNGNATURE అనే అకౌంట్ షేర్ చేసింది. “Sailors capture Mount Stromboli eruption” అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పటికే 2 లక్షలకుపైగా వ్యూస్ సాధించింది. వేలాది మంది లైక్స్ కొట్టగా, వందలాది కామెంట్స్ తో స్పందించారు.
వీడియోపై ఒక వినియోగదారుడు – “ఇప్పటివరకు నీటిలో చూసిన అత్యంత భయంకరమైన సంఘటన ఇదే” అని రాయగా, మరొకరు – “ఇది సినిమా సన్నివేశంలా ఉంది” అని కామెంట్ చేశారు. ఇంకొకరు – “ఈ దృశ్యంలో అత్యంత ప్రమాదకరమైన అంశం ఏమిటంటే, బూడిదా నీరా రెండూ ప్రాణాలకే ముప్పు” అని అన్నారు.
ఈ విస్ఫోటన దృశ్యం నిజంగానే చూస్తున్న వారిలో వణుకు పుట్టిస్తోంది.
ఇవీ చదవండి: Ananya Nagalla : అప్సరసా.. ఏమి ఈ అందం.. అనన్య నాగళ్ల పిక్స్ వైరల్!
Indian Woman Begging : ఏమీటీ దుర్గతి? కెనడాలో భారత యువతి భిక్షాటన? వీడియో వైరల్!
