HomeAndhra PradeshAarogyasri : తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్.. ప్రజారోగ్యంపై పెనుముప్పు

Aarogyasri : తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్.. ప్రజారోగ్యంపై పెనుముప్పు

Aarogyasri : తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఆగిపోయే దిశగా అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద ఉచిత ఔట్‌పేషెంట్‌ (ఓపీ) సేవలు నిలిచిపోయాయి. తెలంగాణలోనూ సెప్టెంబర్ 15 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి.

ఏపీలో ఆస్పత్రుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకారం, ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.2,000 కోట్లకుపైగా బకాయిలు ఇప్పటికీ విడుదల కాలేదు. దీంతో ఆస్పత్రుల నిర్వహణ, సిబ్బంది జీతాలు, ఇంప్లాంట్స్ కొనుగోలు భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటిన్నర సంవత్సరం నుంచి బకాయిలు కోసం ఎదురు చూస్తున్నామని, ఆశలు వమ్మయ్యాక తప్పనిసరి పరిస్థితుల్లో సేవలు నిలిపివేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

ఇకపై బకాయిలు చెల్లించకపోతే, ఆరోగ్యశ్రీ కింద ఉచిత సేవలు ఇవ్వలేమని ఆస్పత్రులు లేఖ ద్వారా ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ఇదే ఏడాదిలో మూడోసారి సమ్మె చేయాల్సి వస్తోందని అసోసియేషన్ తెలిపింది.

తెలంగాణలో కూడా అదే పరిస్థితి
తెలంగాణలోనూ 330 ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. 12 నెలలుగా రూ.1,400 కోట్లకుపైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించాయి. అంతేకాదు, 22 నెలలుగా EHS, JHS పథకాల బిల్లులు కూడా విడుదల కాలేదని స్పష్టం చేశాయి.

ప్రజలకు గట్టి దెబ్బ
ఈ పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్సలు లేకపోవడంతో అప్పులు చేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్లు కూడా రీయింబర్స్‌మెంట్ ఆలస్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

పదేపదే సమ్మెలు
గత ఏడాదిలో ఒకసారి, ఈ ఏడాదిలో ఇప్పటికే రెండుసార్లు ఆస్పత్రులు సేవలను నిలిపేశాయి. ఏప్రిల్‌లో సమ్మె సమయంలో ప్రభుత్వం చర్చలు జరిపి హామీలు ఇచ్చినా, బకాయిలు క్లియర్ కాలేదు. దీంతో మరోసారి సమ్మె తప్పని పరిస్థితి అయింది.

ఇవీ చదవండి: Arogyasri: ఆరోగ్యశ్రీలో మార్పు ఏ మాత్రం సరికాదు
YS Jagan in Mangalagiri: పేదవాడు అప్పులపాలు కాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించాం.. మంగళగిరిలో సీఎం జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు