HomeAndhra PradeshRayalaseema : రాయలసీమ రైతుపై ప్రమాద ఘంటికలు.. టమాటా ధర పతనం

Rayalaseema : రాయలసీమ రైతుపై ప్రమాద ఘంటికలు.. టమాటా ధర పతనం

Rayalaseema : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పంట టమాటా ధర పతనమైంది. రాయలసీమ రైతులపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇప్పటికే కుప్ప కూలిపోయిన ఉల్లి, అరటి, చినీకి తోడు టమాటా అమ్మకం ధరలు పడిపోయాయి. రైతన్నలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్తున్నారు. ధరలు పతనమై అన్నదాత ఆక్రందన నేపథ్యంలో వ్యవసాయ రంగ నిపుణులు ఎంవీఎస్ నాగిరెడ్డి విశ్లేషణ. (Rayalaseema)

ఏమిటీ అన్న దాతల ఆక్రందన!
మార్కెట్ కు తొలిగా వచ్చే ఉల్లి రైతుల సంక్షోభం కొనసాగుతూ ఉండగానే మళ్లీ డిస్ట్రెస్ సేల్ కు అమ్ముకుంటున్న అరటి, చినీ (బత్తాయి), టమాటా పంట ఆందోళన కలిగిస్తోంది.

ఈ ఖరీఫ్ లో రాయలసీమలో ఆగష్టు 7 వరకూ అనావృష్టితో ఒక్క కర్నూలు జిల్లాలో తప్ప మిగిలిన జిల్లాలలో సాగు చాలా తక్కువ జరిగింది. ఆ సాగు జరిగిన పంటలు కూడా దెబ్బ తిన్నాయి.

రాయల సీమ హార్టికల్చర్ హబ్
పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తిలో అగ్రస్థానం..
రాష్ట్రం మొత్తం అన్ని పండ్ల ఉత్పత్తి 213 లక్షల టన్నులు అయితే ఇందులో అరటి 74 లక్షల టన్నులు, రాయలసీమలోనే ఉత్పత్తి 40 లక్షల టన్నులు, చినీ మొత్తం ఉత్పత్తి 24 లక్షల టన్నులు అయితే ఒక్క రాయలసీమలోనే 22.35 లక్షల టన్నులు. రాష్ట్రం మొత్తం అన్ని కూరగాయల ఉత్పత్తి 104.42 లక్షల టన్నులైతే అందులో టమాటా ఉత్పతే 42.46 లక్షల టన్నులు. ఇందులో రాయలసీమలోనే ఉత్పత్తి 41 లక్షల టన్నులు.

ఈ పంట లన్ని ప్రధాన ఉత్పత్తి రాయల సీమ జిల్లాలలోనే..
రాష్ట్ర చరిత్రలోనే జూన్, జులైలో చిత్తూరు జిల్లాలో రైతులు మామిడి కాయలను మొట్ట మొదటిగా రోడ్ల ప్రక్కన పార బోసిన పరిస్థితి చూశాం. ఉల్లి కర్నూలు ఒక్క జిల్లాలో అదికూడా కొన్ని మండలాలలోనే 31 వేల ఎకరాలలో సాగు జరిగి సుమారు 1.5 లక్షల టన్నుల ఉత్పత్తి. ఆగష్టు 4వ వారం నుంచి కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతుల తీవ్ర ఆవేదన ఈరోజుకీ చాలా బాధాకరంగా కొన సాగుతూ ఉంది.

ఇది చాలదు అన్నట్లు కూరగాయలలో అత్యధిక ఉత్పత్తి అయిన టమాటా 42.46 లక్షల టన్నులు.. ధర రూ.5 నుంచి రూ.2 వరకు పడి పోయింది.

పండ్ల సాగులో అత్యధికంగా 2.74 లక్షల ఎకరాల సాగుతో 74 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో G9 అరటి ధరలు క్వింటాలు రూ.600 నుంచి రూ.400 వరకు పడిపోయాయి.

అత్యధికంగా రాయలసీమ జిల్లాలలో కొద్దిగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో 2.79 లక్షల ఎకరాల సాగుతో 24 లక్షల టన్నుల ఉత్పత్తితో ఉన్న చీనీ టన్ను రూ.12 వేల నుండి రూ.6 వేలకు పడిపోయి.. దిక్కు తోచని స్థితి లో రైతులు ఉన్నారు.

అత్యధిక ఉత్పత్తి ఉన్న టమాటా, అరటి, చినీ, ఉల్లి ధరలు పడిపోతే రైతులు ప్రత్యేకంగా రాయల సీమ రైతులు తీవ్రంగా నష్టపోతారు.

గత సంవత్సరం మిర్చి, పొగాకు, మామిడి డిస్ట్రెస్ సేల్..
వేరుశనగ, మినుము, ప్రత్తి చివరికి ఎంతో ప్రముఖ్యత ఉన్న సోనా మసూరి, నంద్యాల సన్నాలు ధాన్యం కనీస గిట్టుబాటు ధర కూడా రాకుండా అమ్ముకున్న పరిస్థితి.

గత సంవత్సర సంక్షోభం నుండి తేరుకోక ముందే ఈ సంవత్సరం ప్రారంభమే రైతు సంక్షోభంతో మొదలయ్యింది.

టమాటా             ఉత్పత్తి
అనంతపురం       11.9 ల. ట.
అన్నమయ్య        8.3 ల ట
శ్రీసత్యసాయి       7.1 ల ట
చిత్తూరు             5.9 ల ట
కర్నూలు            3.0 ల ట
నంద్యాల           2.3 ల ట
కడప                1.6 ల ట
తిరుపతి             0.9 ల ట

రాష్ట్రం మొత్తం ఉత్పత్తి 42.46 ల ట అయితే కేవలం రాయల సీమ లోనే ఉత్పత్తి 41 లక్షల టన్నులు..

అరటి              సాగు            ఉత్పత్తి
అనంతపురం     46.9 వే ఎ     13 ల ట
కడప                42 వే ఎ       11.5 ల ట
అన్నమయ్య       27.2 వే ఎ    7.63 ల ట
తూ గోదావరి       26.4వే ఎ      7.18 ల ట
కోనసీమ             24.5 వే ఎ     6.63 ల ట
మన్యం              17.8 వే ఎ    4.8 ల ట
నంద్యాల           17 వే ఎ        4.6 ల ట
శ్రీసత్య సాయి      7.7 వే ఎ       2.1 ల ట
విజయనగరం       7.2 వే ఎ       1.9 ల ట
రాష్ట్రం మొత్తం 2.77 ల ఎ 74.25 ల ట అయితే రాయలసీమ లోనే ఉత్పత్తి 40 ల టన్నులు

ఇన్ని జిల్లా లలో ప్రధానం గా సాగు జరుగుతూ అనేక రాష్ట్రాలకు ప్రత్యేకంగా దేశ రాజ దానికి ఎంతో ఆరోగ్య కరమైన పండు అందిస్తూ పెట్టు బడి కూడా రాని ధర కు అమ్ముకుంటున్న దుస్థితి..

చినీ               సాగు          ఉత్పత్తి
అనంతపురం    121 వే ఎ   10.3 ల ట
కడప              93.65వే ఎ  7.53 ల ట
ప్రకాశం           9.14 వే ఎ   78 వే ట
కర్నూల్           5.1 వే ఎ    45 వే ట
నంద్యాల         4 వే ఎ         28 వే ట
నెల్లూరు          3.34 వే ఎ     28 వే ట
రాష్ట్రం మొత్తం 2.79 ల ఎ 24 ల ట ల ఉత్పత్తి అయితే కేవలం రాయలసీమలోనే ఉత్పత్తి 22.3 ల ట..

రాష్ట్రానికే కాక అనేక రాష్ట్రాలకు దేశ రాజధానికి పండ్లు, కూరగాయలు అందించే మన రాయలసీమ రైతులు..

ఈ 4 పంటలు కూడా రాయల సీమకు ప్రధానంగా కేంద్రీకృత మైన పంటలు..

రాయలసీమకే ప్రధానమైన వేరుశనగ+నూనె గింజల సాగు 5 లక్షల ఎకరాలు తగ్గిపోయింది.. వేరుశనగ, మినుముల సాగు జరిగిన పంట కూడా అనా వృష్టికి.. అతి వృష్టికి దెబ్బతిన్నది.

ఇటువంటి పరిస్థితిలో అత్యధిక ఉత్పత్తి ఉన్న టమాటా, అరటి, చినీ, ఉల్లి పంటల అమ్మకం ధరలపై ప్రభుత్వం చిత్త శుద్ధితో ఆదుకోక పోతే రైతాగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతారు.

ఈ ఖరీఫ్ సాగు కూడా 14 వారాలు పూర్తి అయ్యే నాటికి 10/9/2025 వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం రాష్ట్ర సరాసరి సాగు 81% జరిగితే రాయలసీమ జిల్లాలైన అనంతపురం 76%, శ్రీసత్యసాయి 42%, అన్నమయ్య 19%, వైయస్ఆర్ కడప 35%, చిత్తూరు 24% మాత్రమే సాగు జరిగింది.

ప్రకటనలకే పరిమితం గాకుండా..చిత్త శుద్ధి తో రైతులను ఆదుకోవాలి.

-ఎంవీఎస్ నాగిరెడ్డి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ (2019-24),
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) సభ్యుడు (2011-14),

ఇవీ చదవండి: Andhra Pradesh : ఏపీలో సంక్షోభంలో ఖరీఫ్ సాగు.. దిక్కుతోచని రైతాంగం
Quinoa : క్వినోవా సాగుపై ఆసక్తి ఉందా? లాభాలు, నష్టాలు.. విశేషాలు
YSRCP Annadata Poru : అన్నదాత పోరును అడ్డుకోవడం దారుణం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు