IND vs PAK: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే పాల్గొనే 8 జట్లు ప్రకటించగా, ఇప్పుడు మ్యాచ్‌లను పర్యవేక్షించే అంపైర్లు, మ్యాచ్ రిఫరీల జాబితాను కూడా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) విడుదల చేసింది. IND vs PAK
భారత్ vs పాకిస్తాన్ – ప్రత్యేక దృష్టి
ఈ టోర్నమెంట్‌లో అత్యంత హాట్ మ్యాచ్‌గా భావించబడుతున్న భారత్–పాకిస్తాన్ పోరు సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకకు చెందిన రుచిరా పల్లియగురుగే, బంగ్లాదేశ్‌కు చెందిన మసుదుర్ రెహమాన్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఆఫ్ఘనిస్తాన్ అంపైర్ అహ్మద్ పక్తిన్ టీవీ అంపైర్‌గా, ఇజాతుల్లా సఫీ నాల్గవ అంపైర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు జింబాబ్వే మాజీ క్రికెటర్ ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తారు.
టోర్నమెంట్ అంపైర్ల జాబితా
మొత్తం 10 మంది అంపైర్లను ఈ ఆసియా కప్ కోసం ఎంపిక చేశారు. వీరిలో భారతదేశం నుంచి వీరేంద్ర శర్మ, రోహన్ పండిట్ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అహ్మద్ పక్తిన్, ఇజాతుల్లా సఫీ, శ్రీలంక నుంచి రుచిరా పల్లియగురుగే, రవీంద్ర విమలసిరి, పాకిస్తాన్ నుంచి ఆసిఫ్ యాకుబ్, ఫైసల్ అఫ్రిది, బంగ్లాదేశ్ నుంచి ఘాజీ సోహైల్, మసుదుర్ రెహమాన్ ఎంపికయ్యారు.
మ్యాచ్ రిఫరీలు
మొత్తం టోర్నమెంట్‌ను పర్యవేక్షించడానికి వెస్టిండీస్ మాజీ కెప్టెన్ రిచీ రిచర్డ్‌సన్, జింబాబ్వే మాజీ క్రికెటర్ ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీలుగా నియమితులయ్యారు. వీరు ప్రతీ మ్యాచ్‌లో నిఘా ఉంచనున్నారు.
ఈ ప్రకటనతో భారత్–పాకిస్తాన్ పోరు కోసం అంపైర్లపై ఉన్న సస్పెన్స్ ముగిసింది. అభిమానులు ఇప్పుడు సెప్టెంబర్ 14న జరగబోయే ఈ క్లాసిక్ పోరుకు కౌంట్‌డౌన్ మొదలు పెట్టేశారు.
ఇవీ చదవండి: India Hockey : 8 ఏళ్ల ఎదురుచూపులకు చెక్.. 4వసారి ఆసియా కప్‌ను దక్కించుకున్న భారత హాకీ జట్టు
Asia Cup 2025 Schedule: మూడోసారి టీ20 ఫార్మాట్లో ఆసియా కప్.. షెడ్యూల్!
