HomeTelanganaTelangana : రోడ్డు పక్కన బ్యాగులో గోల్డ్.. ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే!

Telangana : రోడ్డు పక్కన బ్యాగులో గోల్డ్.. ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే!

Telangana : తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం ప్రాంతానికి చెందిన సుజాత, ఆరోగ్యమిత్రగా పనిచేస్తూ ఉంటుంది. శనివారం సాయంత్రం ఆమె తన కుమారుడితో కలిసి బైక్‌పై ఖానాపూర్‌ వైపు వెళ్తుండగా, కుమార్తె పెళ్లి కోసం చేయించిన 16 తులాల బంగారు ఆభరణాలు, నగదు, గుర్తింపు పత్రాలతో కూడిన సంచిని వాహనానికి కట్టుకున్నారు. అయితే, కొండాపూర్ బైపాస్ వద్ద ఆ సంచి రోడ్డుపై పడిపోయినా వారు గమనించలేదు. (Telangana)

అదే సమయంలో, రాచాపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సాయికుమార్, నిర్మల్ నుంచి కనకాపూర్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా, వడ్యాల్ గ్రామానికి చెందిన ప్రయాణికురాలు సౌజన్య రోడ్డుపై పడి ఉన్న సంచిని చూసి అతనికి తెలియజేసింది. సాయికుమార్ వెంటనే సంచిని తీసుకుని ఇంటికి తీసుకెళ్లి సురక్షితంగా భద్రపరిచాడు.

తర్వాత, బంగారం పోయినట్లు సోషల్ మీడియాలో వచ్చిన సమాచారాన్ని సౌజన్య గమనించి, తన భర్త ద్వారా సాయికుమార్‌కు సమాచారం అందించింది. ఆదివారం సుజాతకు ఈ విషయం తెలియగానే, ఆమె వచ్చి తన బంగారు ఆభరణాలు, నగదు, పత్రాలను తిరిగి స్వీకరించింది. సాయికుమార్ నిజాయతీని గ్రామస్థులు ప్రశంసించి, ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సంఘటన సాయికుమార్ నీతి, ధర్మాన్ని సమాజానికి చాటింది, అందరికీ ఆదర్శంగా నిలిచింది.

ఇవీ చదవండి: Crime News : ఒడిశా మదర్సాలో మైనర్ విద్యార్థిపై లైంగిక దాడి, హత్య
Telangana Crime : అన్న వరసయ్యే వ్యక్తితో యువతి ప్రేమ.. వద్దన్నందుకు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు