Harish Rao : విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై స్పందించారు. “నా జీవితం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిదే. ఇప్పటి వరకు కొంతమంది నాయకులు, కొన్ని పార్టీలు చేసిన ఆరోపణలనే కవిత పునరావృతం చేశారు. ఆమె వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా” అని హరీష్ స్పష్టం చేశారు. (Harish Rao)
అలాగే, కవిత అంశంలో ఇప్పటికే పార్టీ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. “పార్టీకి నేను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను. ఎవరి విషయంలోనైనా పార్టీ తీర్మానమే నాకు ఫైనల్. కేసీఆర్‌నే మా పార్టీ సుప్రీమ్ లీడర్” అని హరీష్ అన్నారు.
ప్రజల కష్టాలపై దృష్టి
కవిత వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోకుండా, ప్రజల సమస్యలపైనే దృష్టి సారిస్తున్నట్లు హరీష్ తెలిపారు.
“రాష్ట్ర సాధనలో నా పాత్ర, నా నిబద్ధత అందరికీ తెలుసు. రెండున్నర దశాబ్దాలుగా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పనిచేశాను” అని పేర్కొన్నారు.
రేవంత్ సర్కార్‌పై విమర్శలు
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా హరీష్ తీవ్ర విమర్శలు చేశారు.
రైతులకు ఎరువులు దొరకక ఇబ్బందులు ఎదురవుతున్నాయని,
వరదలతో ప్రజలు కష్టాలు పడుతున్నారని,
మేము దశాబ్దం పాటు కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తోందని ఆరోపించారు.
“తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే మా లక్ష్యం. మరోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్‌తో భేటీ
ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా తన నివాసానికి చేరుకున్న హరీష్ రావు, శనివారం (సెప్టెంబర్ 6) ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పార్టీ అధినేతను కలవనున్నారు. ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యలపై కేసీఆర్‌తో చర్చించనున్నారు. కేసీఆర్‌తో సమావేశం అనంతరం హరీష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.
ఇవీ చదవండి: Kavitha Press Meet : కవిత సంచలన ప్రెస్ మీట్.. కేటీఆర్, హరీష్ రావులపై హాట్ కామెంట్స్
KCR : కవిత వెనుక కేసీఆర్..? కాళేశ్వరం అవినీతి నుంచి బయటపడడమే లక్ష్యమా?
Kavitha Comments : కేసీఆర్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు
