HomeInternationalAfghanistan : అఫ్గాన్‌లో మత ఛాందసం.. మహిళలైతే ముట్టుకోరా?

Afghanistan : అఫ్గాన్‌లో మత ఛాందసం.. మహిళలైతే ముట్టుకోరా?

Afghanistan : అఫ్గానిస్థాన్‌లో వరుసగా సంభవించిన భూకంపాలు వేలాది మందిని కబళించగా, సహాయక చర్యలలో కూడా మత ఛాందసవాదం అడ్డంకిగా మారింది. శిథిలాల కింద చిక్కుకున్న మహిళలను పురుష సహాయక సిబ్బంది తాకరాదనే నిబంధనతో రక్షించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. (Afghanistan)

ప్రాణాలతో సహాయం కోసం అల్లాడుతున్న మహిళలను కాపాడటానికి మహిళా రెస్క్యూ సిబ్బందే రావాలని అధికారులు చెబుతున్నారు. కానీ తగినంత మంది మహిళా సహాయకులు లేకపోవడంతో అనేక మంది బాధితులు శిథిలాల కింద నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

గత కొద్ది రోజులుగా భూకంపాల బీభత్సం కారణంగా అఫ్గాన్‌లో ఇప్పటివరకు 2,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా శవాల వెలికితీత, సహాయక చర్యల్లో లింగ వివక్ష ఆగకపోవడం మానవత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

తక్షణం మహిళా రెస్క్యూ బృందాల సంఖ్య పెంచకపోతే, భూకంప బాధితుల్లో మరిన్ని ప్రాణనష్టాలు సంభవించే అవకాశం ఉందని సహాయక సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

ఇవీ చదవండి: T20I Rankings: ఆసియా కప్ ముంగిట టీమిండియా నం.1.. మిగతా జట్లు?
Afghanistan A: అఫ్గాన్ సంచలనం.. ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 కైవసం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు