ANYmal : పెంపుడు కుక్కలు సాధారణంగా యజమాని కొట్టిన షటిల్‌ను నోటితో పట్టుకొని తీసుకువస్తాయి. కానీ ఈ రోబో శునకం మాత్రం కొత్త లెవెల్‌కి వెళ్లింది. షటిల్ తెచ్చే బదులు, బ్యాడ్మింటన్ రాకెట్ పట్టుకొని ఆటకే సిద్ధమైంది. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పోర్ట్స్ టెక్నాలజీ కలయికగా రూపుదిద్దుకున్న ఈ రోబో శునకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. (ANYmal)
‘ANYmal’ అనే పేరు
స్విట్జర్లాండ్‌లోని ప్రఖ్యాత ప్రభుత్వ విశ్వవిద్యాలయం ETH Zurich కి చెందిన రోబోటిక్స్ సిస్టమ్స్ ల్యాబ్‌లో ఈ రోబో శునకాన్ని అభివృద్ధి చేశారు. ప్రొఫెసర్ మార్కో హట్టర్ నేతృత్వంలోని పరిశోధకులు ఈ ప్రాజెక్ట్‌పై పనిచేశారు. ‘ANYmal’ అని పేరు పెట్టిన ఈ రోబో శునకం షటిల్‌ను గమనించి వేగంగా కదులుతూ తిరిగి షాట్స్ కొట్టగల సామర్థ్యం కలిగి ఉంది.
రోబో ప్రత్యేకత
బరువు సుమారు 50 కిలోలు
ఎత్తు కేవలం 1.5 అడుగులు
మెషీన్ లెర్నింగ్ ఆధారంగా షటిల్ వేగం, దిశ, ఎత్తు అన్నింటినీ విశ్లేషించి కదిలే సామర్థ్యం
నాలుగు కాళ్లతో పాటు ప్రత్యేకమైన ‘చేయి’ ఉండటం వలన షటిల్‌ను సరిగ్గా రాకెట్‌తో కొట్టగలగడం
ఇది ఎలా పనిచేస్తుంది?
ANYmal ముందుగా ఆటగాడు షటిల్‌ను ఎక్కడి నుంచి కొట్టాడో, ఎంత ఎత్తులో, ఎంత వేగంతో వస్తోందో అన్నింటినీ విశ్లేషిస్తుంది. ఆపై రోబో కాళ్లు ఏ దిశలో కదలాలి, ఎప్పుడు పైకి లేవాలి, షాట్ కొట్టిన తర్వాత సమతుల్యం ఎలా కాపాడుకోవాలి అనే అంశాలన్నీ ముందుగానే ప్రోగ్రామ్ చేయబడ్డాయి.
ప్రాక్టికల్ టెస్టుల్లో మొదట చిన్నచిన్న దశల్లో పరీక్షలు చేసి విజయవంతం అయిన తర్వాత, చివరికి ఆటగాడి షాట్స్‌కి సమానంగా, కోర్ట్‌లోపలే పడేలా రోబో షాట్స్ కొట్టే స్థాయికి తీసుకొచ్చారు.
మనిషి స్థాయి ఆటను సైతం ఎదుర్కొనేలా ఈ రోబో శునకాన్ని అభివృద్ధి చేయడం రోబోటిక్స్ రంగంలో పెద్ద అడుగుగా పరిగణిస్తున్నారు. త్వరలో ఇది క్రీడా ప్రపంచంలో మరిన్ని వినూత్న ప్రయోగాలకు దారితీయనుంది.
ఇవీ చదవండి: Tesla car: టెస్లా అత్యాధునిక డ్రైవర్ లెస్ కారు ఆవిష్కరణ
Banned Names: ప్రపంచంలో నిషేధించిన పేర్లు తెలుసా? ఈ పేర్లు పెట్టుకుంటే చర్యలు తప్పవట!
