HomeAndhra PradeshYS Jagan in Pulivendula : నేటి నుంచి 3 రోజులపాటు జగన్ పులివెందుల పర్యటన

YS Jagan in Pulivendula : నేటి నుంచి 3 రోజులపాటు జగన్ పులివెందుల పర్యటన

YS Jagan in Pulivendula : మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుంచి మూడు రోజుల పాటు వైయస్సార్ జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. (YS Jagan in Pulivendula). దివంగత నేత డాక్టర్‌ వైయస్సార్‌ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేడు పులివెందులకు వైయస్‌ జగన్‌ వెళ్తున్నారు.

మధ్యాహ్నం నుంచి కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో వైయస్‌ జగన్‌ ఉండనున్నారు. రేపు ఉదయం ఇడుపులపాయ వైయస్సార్‌ ఘాట్‌ వద్ద జగన్‌ నివాళులు అర్పించనున్నారు. అనంతరం లింగాల మండలం అంబకపల్లి చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో జగన్‌ పాల్గొంటారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.2.5 కోట్లతో అంబకపల్లిలో కొత్తగా చెరువు నిర్మాణం జరిగింది.

మరో రూ.2.5 కోట్లతో ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి నిధులతో ఎత్తిపోతల పథకం, పైప్‌లైన్‌ నిర్మాణం చేపట్టారు. తాజాగా చెరువు అందుబాటులోకి వచ్చింది. లింగాల కుడి కాల్వ నుంచి అంబకపల్లిలోని గంగమ్మకుంట చెరువుకు నీరు విడుదలైంది. ఈ నేపథ్యంలో అంబకపల్లి గంగమ్మకుంట చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో వైయస్‌ జగన్‌ పాల్గొంటారు. 2వ తేదీ మధ్యాహ్నం నుంచి కార్యకర్తలు, ప్రజలకు జగన్‌ అందుబాటులో ఉంటారు. 3వ తేదీ ఉదయం తిరుగు పయనం అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి: YS Jagan PC : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ.. మొత్తం రిగ్గింగ్‌ : జగన్
Jagan on Rahul : చంద్రబాబు.. రాహుల్.. రేవంత్ @ హాట్‌లైన్: జగన్ చురకలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు