HomeSportsViral Video : అచ్చం తండ్రిలా.. బౌలర్లపై సెహ్వాగ్ కొడుకు ఫైర్!

Viral Video : అచ్చం తండ్రిలా.. బౌలర్లపై సెహ్వాగ్ కొడుకు ఫైర్!

Viral Video : టీమిండియా మాజీ స్టార్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్‌ పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఫియర్‌లెస్ బ్యాటింగ్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంత కఠినమైన పరిస్థితులైనా భయపడకుండా ఎదుర్కొని, బౌలర్లను చిత్తు చేసిన ప్లేయర్ ఆయన. రిటైర్మెంట్‌ తీసుకొని దశాబ్దం గడిచినా, సెహ్వాగ్ ఆడిన శైలి అభిమానుల మనసులో ఎప్పటికీ ముద్రపడి ఉంటుంది. (Viral Video)

ఇప్పుడేమిటంటే… ఆ ఫియర్‌లెస్ ఆటతీరు మళ్లీ క్రికెట్ అభిమానుల కళ్ల ముందుకొచ్చింది. సెహ్వాగ్ పెద్ద కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్, తన తండ్రి లాగా ధైర్యంగా బ్యాటింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరించాడు.

డెబ్యూ మ్యాచ్‌లో దుమ్ము రేపిన ఆర్యవీర్
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తరపున ఆర్యవీర్ తన తొలి మ్యాచ్ ఆడాడు. మ్యాచ్ ప్రారంభంలోనే తన తండ్రి గుర్తుకొచ్చేలా వరుస బౌండరీలు బాదుతూ ఆకట్టుకున్నాడు. మూడో ఓవర్‌లో టీమిండియా సీనియర్ బౌలర్ నవదీప్ సైనీపై ఆడిన షాట్లు ప్రేక్షకులను సెహ్వాగ్ కాలానికి తీసుకెళ్లాయి. మొదటి బంతిని డీప్ ఎక్స్‌ట్రా కవర్ వైపు చెల్లాచెదురుగా పంపించాడు.

తర్వాతి బంతిలో ట్రాక్‌పైకి వచ్చి లాంగ్-ఆఫ్, ఎక్స్‌ట్రా కవర్ మధ్య బలంగా మోసాడు. ఆ తర్వాత స్పిన్నర్ రౌనక్ వాఘేలా ఓవర్‌లో కూడా రెండు వరుస ఫోర్లు బాదాడు. మొత్తానికి 16 బంతుల్లో 22 పరుగులు చేసి అవుట్ అయినా, భయపడి ఆడకపోవడం, ఆకర్షణీయమైన షాట్లతో మెప్పించడం – ఇవన్నీ అతని ఆటను ప్రత్యేకంగా నిలబెట్టాయి.

అద్భుతమైన గత రికార్డులు
గత ఏడాది వినూ మన్కడ్ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆర్యవీర్ 49 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపాడు. కూచ్ బెహార్ ట్రోఫీలో మేఘాలయపై 229 బంతుల్లో 200* పరుగులు సాధించాడు (34 ఫోర్లు, 2 సిక్సర్లు). మొత్తం 309 బంతుల్లో 297 పరుగులు (51 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి, కేవలం మూడు పరుగుల తేడాతో ట్రిపుల్ సెంచరీ మిస్సయ్యాడు.

అభిమానుల్లో కొత్త ఆశ
DPL వేలంలో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ రూ.8 లక్షలకు కొనుగోలు చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్, తొలి మ్యాచ్ నుంచే తన ప్రతిభను చూపించాడు. తండ్రి లాగే ధైర్యంగా ఆడుతున్న అతను భవిష్యత్తులో టీమిండియాలో ఆడే అవకాశం ఉంటుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

ఇవీ చదవండి: World Cup 2011 : ధోని, గంభీర్ కాదు.. అతని మైండ్‌గేమ్‌తోనే టీమిండియాకు వరల్డ్‌కప్!
Rohit Sharma: కివీస్‌తో టెస్తు సిరీస్.. హిట్ మ్యాన్‌కు ఎందుకు కీలకం అంటే..
Duck out: క్రికెట్‌లో డకౌట్‌ అంటే ఏమిటి? ఈ పదం ఎలా వచ్చింది?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు