HomeCinemaPrabhas : ఆయన అలా అనగానే నా కళ్లలో తొలిసారి నీళ్లు వచ్చాయి

Prabhas : ఆయన అలా అనగానే నా కళ్లలో తొలిసారి నీళ్లు వచ్చాయి

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా, ప్రపంచం నలుమూలలకూ ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వరుసగా భారీ సినిమాలతో దూసుకెళ్తున్న ప్రభాస్, ‘సలార్’ మరియు ‘కల్కి 2898 ఏ.డి.’ వంటి సినిమాలతో తిరుగులేని హిట్స్ అందుకున్నారు. (Prabhas)

దాదాపు ఆరేళ్ళ తర్వాత వచ్చిన ‘సలార్’తో మళ్లీ బ్లాక్‌బస్టర్ కొట్టిన ప్రభాస్, ఇప్పుడు మరోసారి ఫుల్ బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఆయన వరుసగా పలు ప్రాజెక్టుల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. త్వరలోనే హారర్ నేపథ్యంలో రూపొందుతున్న ‘రాజా సాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు, ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతోన్న ‘స్పిరిట్’ సినిమాలో ఆయన ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు, ‘సలార్ 2’, ‘కల్కి 2’ లాంటి భారీ సీక్వెల్స్‌తో పాటు, హను రాఘవపూడి దర్శకత్వంలో మరో కొత్త ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తున్నారు డార్లింగ్ ప్రభాస్.

ఈ నేపథ్యంలో, ప్రభాస్ మాట్లాడుతూ ఎమోషనల్ అయిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన తన తొలి సినిమా ఈశ్వర్ గురించి భావోద్వేగంగా చెప్పారు.

“ఈశ్వర్ మూవీ పూజ సమయంలో ఒక డైలాగ్ చెప్పా… ‘ఆ ఈశ్వరుడికి మూడు కళ్లు… ఈ ఈశ్వర్‌కి మూడు గుండెలు’ అని. ఆ టెన్షన్‌లో ఎలాగో అలా చెప్పేశాను. అప్పుడు నా నాన్న నా చెయ్యి పట్టుకొని ఒక్కసారి ‘యస్’ అన్నాడు… ఆ సమయంలో నా కళ్లలో తొలిసారి కన్నీళ్లు వచ్చాయి” అని ప్రభాస్ భావోద్వేగంగా చెప్పారు.

ఈ మాటలు చూసిన అభిమానులు గట్టి గూస్‌బంప్స్ తో ప్రభాస్ ప్రయాణాన్ని మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు. ఈ ఎమోషనల్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇవీ చదవండి: HBD Prabhas: 45 టర్న్ అయిన ప్రభాస్.. చిరు, రామ్ చరణ్ సహా ప్రముఖల గ్రీటింగ్స్
Prabhas: మీకు తెలుసా..? ప్రభాస్‌ను ఓ హీరోయిన్‌ అన్నా అని పిలిచింది..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు