HomeAndhra PradeshTirumala Laddu : కియోస్క్ యంత్రాల ద్వారా శ్రీవారి లడ్డూల విక్రయం

Tirumala Laddu : కియోస్క్ యంత్రాల ద్వారా శ్రీవారి లడ్డూల విక్రయం

Tirumala Laddu : తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కోనుగోలుకు టీటీడీ నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలోని లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో భక్తులకు మరింత సులభతరంగా లడ్డూలను కోనుగోలు చేసేందుకు కియోస్క్ యంత్రాలను అందుబాటులో ఉంచింది. (Tirumala Laddu) ఈ సదుపాయం ద్వారా భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించి త్వరితగతిన లడ్డూల కొనుగోలు ప్రక్రియ చేసేలా అవకాశం కల్పించడం జరిగింది.

యూపీఐ చెల్లింపు సదుపాయం ద్వారా నగదు లేకుండా పారదర్శక లావాదేవీలు జరిగేలా టీటీడీ ఏర్పాటుచేసింది.
కియోస్క్ ద్వారా లడ్డూలు పొందే విధానం –
భక్తులు లడ్డూ పంపిణీ కౌంటర్లకు సమీపంలో ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రం వద్దకు వెళ్తారు.

యంత్రంలో రెండు ఆప్షన్లు కనిపిస్తాయి:
1.దర్శన టికెట్ ఉన్నవారు
2.దర్శన టికెట్ లేనివారు

దర్శన టికెట్ ఉన్నవారు: ఈ ఆప్షన్ ఎంచుకోండి. టికెట్ వివరాలను యంత్రం ధృవీకరిస్తుంది. టికెట్‌లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తికి రెండు అదనపు లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు.

దర్శన టికెట్ లేనివారు:
ఈ ఆప్షన్ ఎంచుకుని సరైన(verified) ఆధార్ నంబర్ ఇవ్వాలి. ఈ మార్గం ద్వారా కూడా ప్రతి వ్యక్తికి 2 లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు. సరైన ఆప్షన్ ఎంచుకున్న తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపు చేయాల్సిన పేజీకి వెళ్లి లావాదేవీలు పూర్తి చేయవచ్చు. చెల్లింపు అనంతరం ముద్రిత రసీదు అందుతుంది.

ఆ రసీదుతో లడ్డూ కౌంటర్ల వద్దకు వెళ్లి అదనపు లడ్డూలు పొందవచ్చు. భక్తుల సౌకర్యార్థం టిటిడి ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానానికి నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఇవీ చదవండి: Tirumala news: తిరుమలలో అధికారుల నిర్లక్ష్యం.. ఈవో సంచలన వ్యాఖ్యలు
Chinta Mohan: తిరుమల లడ్డూలో పంది కొవ్వు, చేపనూనె కలిసిందనేది అబద్ధం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు