Devotional : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు రెండవ రోజు వైభవంగా సాగాయి. (Devotional) ఉదయం 10 -11గం.ల మధ్య స్వామి వారికి కళ్యాణోత్సవం చేపట్టారు.
మధ్యాహ్నం 3 – 4 గం.ల మధ్య శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం చేశారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు.
సాయంత్రం 5.45 – 6.15 గం.ల మధ్య ఊంజల్ సేవ చేపట్టారు. రాత్రికి 7 – 8.30 గం.ల మధ్య హనుమంత వాహనంపై నాలుగు మాడ వీధుల్లో స్వామివారు విహరించారు.
జూన్ 19న ముగింపు ఉత్సవాలు
జూన్ 19న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు ముగియనున్నాయి. రాత్రి 7 – 8.30 గం.ల మధ్య గరుడ వాహనంపై స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరింధ్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఆర్జితం ఇన్స్పెక్టర్ కె.చలపతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: Alipiri Toll Plaza : భక్తుల సౌకర్యార్థం.. అలిపిరి టోల్ ప్లాజా పునరుద్ధరణ
Renigunta Airport : శ్రీవేంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేందుకు సిఫార్సు
Lord Venkateswara: శ్రీవేంకటేశ్వర స్వామివారు ఎవరిని ఇష్టపడతారు? స్వామి గురించి రహస్యం ఇదిగో..!
