HomeAstrologyDhanusu Rasi 2025: ధనస్సు రాశి 2025 ఫలితాలు.. సంపాదన పెరుగుతుంది!

Dhanusu Rasi 2025: ధనస్సు రాశి 2025 ఫలితాలు.. సంపాదన పెరుగుతుంది!

Dhanusu Rasi 2025: కొత్త సంవత్సరం 2025లో ధనుస్సు రాశి వారికి సంపాదన పెరగబోతోందట. ద్వాదశ రాశుల్లో ఈ రాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో కొన్ని ఆరోగ్య సమస్యలు మినహా అంతా బాగుందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ట్యాక్స్ గొడవలు కాస్త చికాకు పెడతాయని, రైతులు, ఉద్యోగులకు బాగుందని పండితులు చెబుతున్నారు. (Dhanusu Rasi 2025)

ధనుస్సురాశి 2025 ఫలితాలు

మూల 1, 2, 3, 4 పాదాలు
పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు
ఉత్తరాషాఢ 1వ పాదం

ఈ సంవత్సరం ధనస్సు రాశి జాతకులకు
ఆదాయం 5
వ్యయం 5
రాజపూజ్యం 1
అవమానం 5

ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతోంది. ఆదాయం పెరుగుతోంది. మీరు అనుకున్న రూపాయి కంటే పది రూపాయలు సంపాదిస్తారు. మొదట్లో కష్టమైనా మార్చి నుంచి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు ప్రారంభిస్తారు. బాగా డబ్బు సంపాదిస్తారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతానం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. అవివాహితులకు వివాహ యోగం. సంతానం లేని వారికి సంతాన యోగం. విద్యార్థులకు విశేషించి అనుకూలం. వీసాలు వస్తాయి. విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారం బాగుంటుంది. పేపర్లకు సంబంధించి, డాక్యుమెంటేషన్ కు సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

ఉద్యోగులకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి విశేషించి అనుకూలం. ట్రాన్స్ ఫర్లు, ప్రమోషన్లు అనుకూలం. పై అధికారుల మన్ననలు పొందుతారు. అన్ని రంగాల వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.

కాకపోతే ఈ సంవత్సరం ఉండే సమస్యలు చూస్తే.. వ్యాపార రంగంలో ఉండే వారికి ట్యాక్స్ గొడవలు ఉండే అవకాశం ఉంది. సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగానే కట్టేయాలి.

రైతులకు ఈ సంవత్సరం దిగుబడి, రాబడి కలిసి వస్తుంది. రెండు పంటలూ బాగుంటాయి. అనుకూలమైన ఫలితాలు, ఎక్కువ సంపాదిస్తారు. అప్పులు తీరుస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు.

కళాకారులకు, క్రీడాకారులకు ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో అనుకూలం. విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.

రాజకీయ నాయకులకు విశేషించి అనుకూలం. సమాజంలో, సంఘంలో గౌరవంతో పాటు ప్రజల్లో విపరీతమైన సానుకూలత ఉంటుంది. మీరు పోటీ చేసిన స్థానాల్లో గెలుపు, లేదా నామినేటెడ్ పదవులు ఈ సంవత్సరం దక్కే అవకాశం.

ధనుస్సు రాశి వారికి ఉన్న ఒకే ఒక్క రెమెడీ శనివార నియమాన్ని పాటించడం. శనివారం రాత్రి పూట భోజనం చేయకుండా టిఫిన్ చేస్తూ ఉండాలి. వీలైతే తిరునల్లార్ శనైశ్చర ఆలయంలో ప్రత్యేకమైన శనిపూజ నిర్వహించుకోవడం వల్ల ఈ సంవత్సరం మీ సమస్యల నుంచి గట్టెక్కుతారు.

ఇవీ చదవండి: Vruschika Rasi 2025: వృశ్చిక రాశి 2025 ఫలితాలు.. స్త్రీలకు ఆ విషయాల్లో అనుకూలం!
Simha Rasi 2025: సింహరాశి 2025 ఫలితాలు.. అష్టమ శని ప్రభావంతో వీరికి?
Karkataka Rasi 2025: కర్కాటక రాశి 2025 ఫలితాలు.. చిన్న చిన్న సమస్యలు మినహా..!
Vrushabha rasi: వృషభరాశి 2025 ఫలితాలు.. పట్టిందల్లా బంగారమే!
2025 Rasi Phalalu: విశ్వావసు నామ సంవత్సరం 2025 రాశి ఫలాలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు