HomeAstrologyTula Rasi 2025: తులా రాశి 2025 ఫలితాలు.. 100కు 100 మార్కులు!

Tula Rasi 2025: తులా రాశి 2025 ఫలితాలు.. 100కు 100 మార్కులు!

Tula Rasi 2025: ద్వాదశ రాశుల్లో తులా రాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరం 2025లో అన్ని విధాలా అనుకూలంగా ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 100కు 100 మార్కులు వేయొచ్చని స్పష్టం చేస్తున్నారు. అయితే, ఏదైనా సంచలనం నమోదై టీవీకి గానీ, పేపర్ కు గానీ, మీడియాకు ఎక్కే చాన్స్ ఉందంటున్నారు. 2025 సంవత్సరం ఈ రాశివారికి (Tula Rasi 2025) ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

తులా రాశి ఫలితాలు 2025

చిత్త 3, 4 పాదాలు
స్వాతి 1, 2, 3, 4 పాదాలు
విశాఖ 1, 2, 3 పాదాలు

ఈ సంవత్సరం తులా రాశి జాతకులకు
ఆదాయం 11
వ్యయం 5
రాజపూజ్యం 2
అవమానం 2

ఈ సంవత్సరం తులా రాశి 100కు 100 మార్కులు వేయాల్సి ఉంటుంది. ఒకే ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే.. మీ కుటుంబంలో సంచలనం నమోదు కాబోతోంది. మీడియాకు ఎక్కొచ్చు, పోలీస్ కేసు అవ్వొచ్చు, అతి పెద్ద యాక్సిడెంట్ జరగొచ్చు, ఏదో ఒక రకంగా పేపర్ కు గానీ, మీడియాకు గానీ తులా రాశి కుటుంబం ఎక్కే అవకాశం కనిపిస్తోంది. అది మినహా మిగతా అంతా అనుకూలంగా ఉండబోతోంది.

విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి చదువు అబ్బుతుంది. ఎక్కువగా మార్కులు వస్తాయి. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. ప్లేస్ మెంట్స్ అనుకూలంగా ఉంటాయి. పర్సెంటేజీ పెరుగుతుంది. మీరు కోరుకున్న కాలేజీలు, యూనివర్సిటీల్లో సీటు దక్కుతుంది. విదేశాల్లో వీసాలు వస్తాయి. విదేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ యోగ సూచనలు గోచరిస్తున్నాయి. సంతాన యోగ సూచనలు గోచరిస్తున్నాయి.

ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు పూర్తి యోగదాయకంగా కనిపిస్తోంది. ప్రమోషన్లు, పై అధికారుల మన్ననలు పొందుతారు. గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు ఈ సంవత్సరం తొలగిపోతాయి. కుటుంబంలో శుభకార్యాలు నెరవేరుస్తారు. ఇల్లు, స్థలాలు కొంటారు.

రైతులకు రెండు పంటలూ దిగుబడి బాగుంది. రాబడి పెరుగుతుంది. అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఇంతకు ముందు చేసిన అప్పులు తీరుస్తారు. కుటుంబంలో శుభకార్య వాతావరణం. ఇల్లు లేదా భూమి కొంటారు.

రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది. చాలా చాలా గుర్తింపు ఉంటుంది. ప్రజల్లో మీ తెలివితేటల వల్ల మన్ననలు పొందుతారు. ఈ సంవత్సరం పోటీ చేసే వారికి గెలుపు వరిస్తుంది. నామినేటెడ్ పదవుల్లో ఏదో ఒకటి దక్కుతుంది.

కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలం. మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి. వివిధ దేశాల్లో ప్రోగ్రాములు చేస్తారు.

ఓవరాల్ గా ఆ ఒక్క పాయింట్ జాగ్రత్తగా ఉండాలి. అది తప్ప నెగిటివ్స్ ఏమీ లేవు. రెమెడీస్ కూడా ఏమీ అవసరం లేదు.

ఇవీ చదవండి: Kanya Rasi 2025: కన్య రాశి 2025 ఫలితాలు.. ఏప్రిల్, మే తప్ప మిగతా అనుకూలమే!
Simha Rasi 2025: సింహరాశి 2025 ఫలితాలు.. అష్టమ శని ప్రభావంతో వీరికి?
Vrushabha rasi: వృషభరాశి 2025 ఫలితాలు.. పట్టిందల్లా బంగారమే!
2025 Rasi Phalalu: విశ్వావసు నామ సంవత్సరం 2025 రాశి ఫలాలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు