HomeAstrologyKanya Rasi 2025: కన్య రాశి 2025 ఫలితాలు.. ఏప్రిల్, మే తప్ప మిగతా అనుకూలమే!

Kanya Rasi 2025: కన్య రాశి 2025 ఫలితాలు.. ఏప్రిల్, మే తప్ప మిగతా అనుకూలమే!

Kanya Rasi 2025: కన్య రాశి జాతకులకు 2025 సంవత్సరం యోగ కాలంగా ఉండబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది పొడవునా అనుకూలంగానే ఉంటుందని, కానీ ఏప్రిల్, మే మాసాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. కన్య రాశి (Kanya Rasi 2025) జాతకులకు ఈ ఏడాది ఫలితాలు ఎలా ఉన్నాయో వివరాలు ఇవీ..

కన్య రాశి ఫలితాలు 2025

ఉత్తర 2, 3, 4 పాదాలు
హస్త 1, 2, 3, 4 పాదాలు
చిత్త 1, 2 పాదాలు

ఈ సంవత్సరం కన్యరాశి జాతకులకు
ఆదాయం 14
వ్యయం 2
రాజపూజ్యం 6
అవమానం 6

ఈ సంవత్సరం కన్య రాశి వారికి విశేషించి యోగ కాలంగా భావించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా 12 నెలల పాటు అనుకూలంగా ఉంది. కానీ ఏప్రిల్, మే నెలల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీన రాశిలో ఏర్పడే షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ మీమీద కూడా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.

తమ అనుకునే వాళ్ల వల్ల మోసపోయే అవకాశాలున్నాయి. రక్త సంబంధీకుల వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇతర ఏ సమస్యలూ కన్య రాశి జాతకులకు లేవు.

విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. మార్కులు ఎక్కువగా వస్తాయి. ఉద్యోగం లభిస్తుంది. వివాహం అవుతుంది. సంతానం ఏర్పడుతుంది. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్లు ఉంటాయి. ప్రమోషన్లు, పై అధికారుల మన్ననలు పొందుతారు. మీకు రావాల్సిన లోన్లు వస్తాయి. లోన్లు తీసుకుని ఉంటే వాటిని తీర్చేస్తారు. ఇంట్లో శుభకార్యాలుంటాయి.

వ్యాపారస్తులకు సంబంధించి అన్ని వర్గాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. రియల్ఎస్టేట్, కన్ స్ట్రక్షన్ వారికి, మద్యం వ్యాపారులకు, క్లాస్ 1 కాంట్రాక్టులు చేసే వారికి, గోడౌన్లు ఉన్న వారికి.. ఇలా అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతోంది.

రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం విశేషించి చాలా అనుకూలంగా ఉండబోతోంది. సమాజంలో కొద్దిపాటి చెడ్డపేరు ఉన్న రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం గెలుపొందుతారు. అంటే ఈ సంవత్సరం రాబోతున్న సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కన్య రాశి వారు పోటీ చేస్తే గెలుపు మిమ్మల్ని వరిస్తుంది. నమ్మకం లేకపోయినా అనూహ్యంగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

క్రీడాకారులకు, కళాకారులకు ఈ సంవత్సరం అవార్డులు, రివార్డులు దక్కే అవకాశం ఉంది. విదేశాల్లో ప్రోగ్రాములు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే స్త్రీలకు చాలా అనుకూలం.

ఓవరాల్ గా కన్య రాశి వారికి ఈ సంవత్సరం ఎటువంటి నెగిటివ్స్ కనిపించడం లేదు. 98 శాతం సక్సెస్ రేటు ఉంటుంది. కచ్చితంగా ఈ సంవత్సరం అనుకూల ఫలితాలే ఉంటాయి.

ఇవీ చదవండి: Simha Rasi 2025: సింహరాశి 2025 ఫలితాలు.. అష్టమ శని ప్రభావంతో వీరికి?
Karkataka Rasi 2025: కర్కాటక రాశి 2025 ఫలితాలు.. చిన్న చిన్న సమస్యలు మినహా..!
2025 Rasi Phalalu: విశ్వావసు నామ సంవత్సరం 2025 రాశి ఫలాలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు