YSRCP for Farmers: కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలుగా నష్టపోతున్న రైతుల సమస్యలపై వైయస్సార్‌సీపీ ఆందోళన (YSRCP for Farmers) చేపడుతోంది. ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించడంతో పాటు, అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనుంది. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ రిలీజ్ చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమ పోస్టర్లు రిలీజ్ చేసిన నాయకులు, సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ర్యాలీ నిర్వహణపై చర్చించారు.
రైతులకు పెట్టుబడి సాయంగా అంతకు ముందు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా రూ.13,500కు బదులు, పథకం పేరు మార్చి రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన కూటమి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పింది. ఈ ఏడాది 2 సీజన్లలోనూ ఒక్క రూపాయి కూడా రైతులకు పెట్టుబడి సాయంగా ఇవ్వలేదు. (YSRCP for Farmers)
ఇటీవల వరుస తుపాన్లపై ముందస్తు సమాచారం ఉన్నా, ఎక్కడా రైతులను ఆదుకునే యోచన చేయలేదు. పౌర సరఫరాల మంత్రి కానీ, సీఎం కానీ కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు. ప్రభుత్వం ఉండి కూడా ఏ సహాయం చేయకపోవడంతో, రైతులు నిస్సహాయులయ్యారు. దీంతో భారీ వర్షాలకు కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముదై్దంది. (YSRCP for Farmers)
మరోవైపు గతంలో ఈ–క్రాప్ విధానంతో, ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరణ పకడ్బందీగా జరగ్గా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పద్ధతికి మంగళం పాడింది. ఈ–క్రాప్ లేదు. ఆర్బీకేలు నిర్వీర్యమయ్యాయి. దీంతో ధాన్యం సేకరణ అస్తవ్యస్తమైంది. ఆ వ్యవహారమంతా మళ్లీ దళారుల చేతుల్లోకి వెళ్లింది. ఫలితంగా పంటలకు గిట్టుబాటు ధర అన్న మాటే లేకుండా పోయింది. రైతులు ఒక్కో 75 కేజీల« ధాన్యం బస్తాపై రూ.325 వరకు నష్టపోతున్నారు.
ఇంకా వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ధాన్యం సేకరణ సందర్భంగా రైతులకు పక్కాగా, గన్నీబ్యాగ్‌లు, లేబర్, రవాణా (ఎఔఖీ)ఖర్చులు అందించింది. ఒకవైపు ప్రభుత్వం స్వయంగా ధాన్యం సేకరించడం, మరోవైపు ఈ వ్యయాన్ని కూడా భరించడం వల్ల, రైతులకు కచ్చితంగా కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) లభించడంతో పాటు, అదనంగా రూ.252 దక్కాయి. (YSRCP for Farmers)
ఫోన్‌లో మెసేజ్ పెడితే చాలు, వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని, రైతుల నుంచి ప్రతి గింజ ధాన్యం కొంటామన్న పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ మాటలు నీటి మూటలయ్యాయి. తాము ఎన్ని మెసేజ్‌లు పెట్టినా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఏ స్పందనా లేదని రైతులు చెబుతున్నారు. ఈ దారుణ పరిస్థితి నేపథ్యంలో రైతులకు అండగా వైయస్సార్‌సీపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది.
ఈనెల 13న ఇదీ ఆ కార్యక్రమ కార్యాచరణ:
ధాన్యం సేకరణలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తూ.. రైతులకు తప్పనిసరిగా మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేయడంతో పాటు, పెట్టుబడి సాయంగా ఇస్తామన్న రూ.20 వేలు కూడా ఇవ్వాలని కోరడం. వాటితో పాటు, ఇప్పటివరకు రైతులకు అందుతున్న ఉచిత పంటల బీమాను వర్తింప జేయాలన్న డిమాండ్ తో రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం సమర్పిస్తారు.
ర్యాలీ కార్యక్రమంపై వైయస్సార్‌సీపీ నాయకులు ఏమన్నారంటే..
అనంత వెంకటరామిరెడ్డి. పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు.
– రైతులకు భరోసా కల్పించడం లో చంద్రబాబు సర్కార్ విఫలమైంది.
ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో సీఎం సమాధానం చెప్పాలి. రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తామన్న రూ.20 వేలు ఎందుకు ఇవ్వడం లేదు?.
విశ్వేశ్వర్‌రెడ్డి. మాజీ ఎమ్మెల్యే.
– రైతులంటే చంద్రబాబుకు చులకనా? వారికి ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలి. కరవు కాటకాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
తలారి రంగయ్య. మాజీ ఎంపీ.
– రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించటంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలం. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీల కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి.
ఎస్వీ మోహన్‌రెడ్డి. పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు.
– కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోంది. గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి సహాయం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల ఏ సమస్య అయినా పరిష్కరిస్తామని గొప్పగా చెప్పిన మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఆ సమస్యలు కనిపించడం లేదా? ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించలేదు.
కాటసాని రాంభూపాల్‌రెడ్డి. పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు.
– అకాల వర్షాల సమయంలోనూ ప్రభుత్వం నిద్ర పోతోంది. పంటలు కాపాడేందుకు కనీస చర్యలు చేపట్టడం లేదు. అనేక చోట్ల« ధాన్యం నీట మునిగి రంగు మారినా, ఆ ధాన్యం కొనుగోలును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు దిగాలుగా చూస్తున్నారు. ఆ నెపాన్ని ఉద్యోగులపై వేసి తప్పించుకోవాలని సీఎం ప్రయత్నిస్తున్నారు.
భూమన కరుణాకర్‌రెడ్డి. పార్టీ తిరుపతి జిల్లా అ«ధ్యక్షుడు.
– 20 ఏళ్ల క్రితమే చంద్రబాబు రైతు వ్యతిరేకి. ఉచిత కరెంటు ఇస్తామని ఆనాడు వైయస్సార్ చెబితే, అది అసాధ్యమని, అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని ప్రచారం చేసిన వ్యక్తి చంద్రబాబు. రైతుల రుణమాఫీ చేస్తామని 2014లో హామీ ఇచ్చి ఎగ్గొట్టారు. ఇప్పుడు పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామని, ఆ మాట కూడా తప్పారు.
ఆకెపాటి అమర్‌నాథ్‌రెడ్డి. రాజంపేట ఎమ్మెల్యే.
– టీడీపీని నమ్మి ప్రజలను ఓటేస్తే చంద్రబాబు వారిని మోసం చేశారు. కేవలం మా పార్టీని, జగన్‌గారిని నిందించడంలోనే కూటమి పెద్దలు కాలం వెళ్లదీస్తున్నారు. అనేక సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నా, ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. నిజానికి కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలవారు నానా ఇబ్బంది పడుతున్నారు.
ధర్మాన కృష్ణదాస్. పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు.
– రైతుల పట్ల కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. ప్రభుత్వ తీరుతో ధాన్యం కొనుగోళ్లు లేక, రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు. దళారుల చేతుల్లో రైతుల తీవ్రంగా నష్టపోతున్నారు. వారికి ఎమ్మెస్పీ కూడా లభించడం లేదు.
గుడివాడ అమర్‌నాథ్. మాజీ మంత్రి.
– కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది. వారిని ఏవిధంగానూ ఆదుకోవడం లేదు. ధాన్యం సేకరణ లేదు. కనీస మద్దతు ధర అంత కంటే లేదు. పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తామని, ఆ మాట కూడా తప్పి మోసం చేశారు. రైతుల కష్టం ఇప్పుడు దళారుల పాలవుతోంది.
ఇవీ చదవండి: Input Subsidy to Farmers: రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ రిలీజ్.. అందాల్సిన సాయం అందాల్సిన సమయానికే!
Gadikota: ఉచిత పంటల బీమాకు చంద్రబాబు సర్కార్ మంగళం
