Google Map: డ్రైవింగ్ చేసే సమయంలో దారి తెలియకపోతే గూగుల్ మ్యాప్స్ వాడటం సహజంగా ఎవరైనా చేస్తుంటారు. లేదంటే దారిలో ఎవరినైనా అడిగి తెలుసుకుని వెళ్తుంటారు. అయితే, గూగుల్ మ్యాప్ ను (Google Map) గుడ్డిగా నమ్మి ప్రాణాలు కోల్పోతున్న వారు కూడా ఉండటం కలవరపెడుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఘోర ప్రమాదం జరిగింది.
గూగుల్ మ్యాప్ ను ఫాలో అయిన ముగ్గురు వ్యక్తులు కారు డ్రైవ్ చేసుకుంటూ నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి వెళ్లారు. దీంతో వంతెన చివరికి వెళ్లి అమాంతం నదిలో పడిపోయి కారు నుజ్జు నుజ్జయిపోయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురూ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.
బాధితులు బదౌన్ జిల్లాలోని బరేలీ నుంచి డేటాగంజ్‌కు ప్రయాణిస్తుండగా ఖల్పూర్-దతాగంజ్ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న బరేలీలోని ఫరీద్‌పూర్ పోలీస్ స్టేషన్, బదౌన్‌లోని డేటాగంజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో కారును నదిలో నుంచి బయటకు తీయించారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కారు ప్రమాదం GPS నావిగేషన్ వల్ల జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. వంతెన పూర్తి కాలేదన్న విషయం కారులో ప్రయాణించిన వారికి తెలియదని చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చి, ఆ వంతెన ముందు భాగం నదిలో కొట్టుకుపోయింది. ఈ విషయం తెలియని బాధితులు జీపీఎస్ మ్యాప్ ప్రకారం బ్రిడ్జిపై వేగంగా కారులో ప్రయాణించారు. వంతెనపై నుంచి కారు కిందకు పడిపోవడంతో అక్కడే మృతి చెందారు. ఈ వార్త విన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మరాదని, స్థానికంగా ఎవరైనా ఉంటే వారిని అడిగి తెలుసుకోవాలని ఈ ఘటన చెబుతోంది.
ఇవీ చదవండి: Google Maps: గూగుల్ మ్యాప్స్ అప్ డేట్.. ఏయే ఫీచర్లు వచ్చాయంటే!
Google AI: 2024లో గూగుల్ ఏఐ ఉపయోగపడిందో మీకు తెలుసా?
Google Pixel Tablet: గూగుల్ పిక్సెల్ టాబ్లెట్ 2 కీలక ఫీచర్లు లీక్!
Google Pixel 8a: గూగుల్ పిక్సెల్ 8ఏ.. లాంచింగ్ ఎప్పుడు? ఫీచర్స్ ఎలా ఉంటాయి?
