HomeCrime NewsRoad Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Road Accident: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి వద్ద ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. (Road Accident) ఆర్టీసీ బస్సు – ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. ఘటనాస్థలిలో ఇద్దరు, ఆసుపత్రి లో నలుగురు మృతి చెందారు. గార్లదిన్నె మండలం తలగాసి పల్లి క్రాస్ వద్ద ఆర్టీసీ బస్, ఆటో ఢీ కొంది.

డి. నాగమ్మ, రామంజినమ్మ, బాలపెద్దయ్య, బి. నాగమ్మ మృతి చెందారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటో లో ప్రయాణిస్తున్న 13 మంది పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. తిమ్మంపేట వద్ద అరటి తోటలో కూలి పని నిమిత్తం వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో తలగాసిపల్లి క్రాస్ దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. హైదరాబాద్ కు వెళ్తున్న బస్సు.. ఆటోని ఢీ కొట్టింది.

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం, కలగాసుపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఇవీ చదవండి: Cyber Crime: సైబర్ కేటుగాళ్లకు చుక్కలు చూపించాడు.. లక్షలు సేఫ్!
Telangana crime news: ‘జులాయి’ సీన్.. బ్యాంకుకు కన్నేసి రూ.13 కోట్ల బంగారం దోపిడీ!
Vizag Crime news: నగ్న వీడియోలు చూపి.. సామూహిక అత్యాచారం
Crime News: కోడలి అక్రమ సంబంధం.. మందలించినందుకు అత్తను..
Telangana crime news: గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. పండుగ వేళ విషాదం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు