HomeAndhra PradeshAP Assembly: అసెంబ్లీ అధికారులపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం

AP Assembly: అసెంబ్లీ అధికారులపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం

AP Assembly: అసెంబ్లీ అధికారులపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలను సరిగా పరిశీలించకుండా సంబంధం లేని మంత్రులకు పంపుతున్నారని స్పీకర్ అసహనం చెందారు. (AP Assembly) దీంతో ప్రశ్న ఒకటి, మంత్రిత్వశాఖ మరొకటి మెన్షన్ చేస్తున్నారన్నారు.

ఇళ్ల పంపిణీకి సంబంధించిన ప్రశ్న రెవెన్యూకి అధికారులు పంపారు. గోదావరి పుష్కరాల పనులపై జలవనరులశాఖ మంత్రికి ప్రశ్న పంపారు. ఇదే సమయంలో మండలిలో గాలేరు-నగరి సబ్జెక్ట్ వచ్చింది. హంద్రీనీవా అనుసంధాన ప్రాజెక్టులపై ప్రశ్నలు వెళ్లాయి. ఒకే మంత్రికి ఉభయసభల్లో ఎలా ప్రశ్న వేస్తారని అధికారులను స్పీకర్ అయ్యన్న నిలదీశారు.

సరిగా చూసుకోవాలంటూ అధికారులను హెచ్చరించారు. అయోమయానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సభాపతి అయ్యన్నపాత్రుడు హితవు పలికారు.

గోదావరి పుష్కర ఏర్పాట్లపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావన వచ్చింది. పుష్కరాలకు ముందస్తుగానే ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. గత పుష్కరాలకి పనులు ఆలస్యం కావడంతో కొన్ని సమస్యలు వచ్చాయన్నారు. ఈసారి అలా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బుచ్చయ్య చౌదరి లేవనెత్తిన అంశానికి మంత్రి నిమ్మల సమాధానం ఇచ్చారు. తప్పకుండా ముందస్తుగానే ఏర్పాట్లు మొదలుపెడతామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని నిమ్మల తెలిపారు.

ఇవీ చదవండి: Visakhapatnam: విశాఖ‌లో 2 ద‌శ‌ల్లో 4 కారిడార్ల‌లో మెట్రో రైల్ ప్రాజెక్ట్
Visakha Dairy: విశాఖ డెయిరీ రైతుల సంక్షేమం వదిలి సొంత లాభం చూస్తోంది
Vijaya Dairy: విజయ డెయిరీ వివాదం.. త్వరలో మీ బండారం బయటపెడతా
Chittoor Dairy: టీడీపీ మూసేస్తే.. నేడు పునరుద్ధరిస్తున్న జగన్.. అలా ఎలా బాగు చేస్తారంటూ ప్రతిపక్షం గగ్గోలు! (Special Story)
AP Assembly: ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ.. జగన్ వర్సెెస్ షర్మిల!
AP legislative council: వాలంటీర్లు, అప్పులపై మండలిలో షాకింగ్ ఘటన

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు