HomeAndhra PradeshAP legislative council: వాలంటీర్లు, అప్పులపై మండలిలో షాకింగ్ ఘటన

AP legislative council: వాలంటీర్లు, అప్పులపై మండలిలో షాకింగ్ ఘటన

AP legislative council: వాలంటీర్ల వ్యవస్థ, రాష్ట్ర అప్పులపై ఏపీ మండలిలో వాడీవేడి చర్చ జరిగింది. ప్రతిపక్షం రచ్చ చేసింది. వాలంటీర్ వ్యవస్థకు చంద్రబాబు ప్రభుత్వం షాక్ ఇచ్చిందని, అసలు వ్యవస్థ ఉందా లేదా అని వైయస్సార్ సీపీ నిలదీసింది. వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదని మంత్రులు సైతం క్లారిటీ ఇవ్వడంతో పెద్ద చర్చే జరిగింది. (AP legislative council)

రాష్ట్రంలో వాలంటీర్లు పనిచేయడం లేదని శాసన మండలిలో మంత్రి డోలా బాల వీరాంజనేయులు ప్రకటన చేశారు. వాలంటీర్ల వేతనం పెంచే ప్రతిపాదన లేదని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి సమాధానంపై వైయస్సార్ సీపీ ఎమ్మెల్సీలు భగ్గుమన్నారు. వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు గుర్తు చేశారు.

వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తున్నారా..లేదా అని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. వాలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలు చేస్తామన్నారని గుర్తు చేశారు. మంత్రి అసలు వ్యవస్థే లేదనడం దారుణమన్నారు. రెన్యువల్ జీవో మీరు ఇవ్వొచ్చు కదా అని బొత్స సూచించారు. దీనికి వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి బాల వీరాంజనేయులు సమాధానం ఇచ్చారు. లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామని ప్రశ్నించారు. కొనసాగిస్తే జీతాలు పెంచుతాం అన్నామని, కొనసాగించలేదు కాబట్టి జీతాలు పెంచం అని సమాధానం ఇచ్చారు.

అప్పులపై రచ్చ
శాసనమండలిలో గత ప్రభుత్వం అప్పులపై టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. గత ప్రభుత్వం రూ.9,74,000 కోట్ల అప్పు చేసిందని ఆర్థిక మంత్రి పయ్యావుల వెల్లడించారు. సీఏజీకి ఇచ్చిన లెక్కల ప్రకారం ప్రభుత్వ అప్పులు రూ.4,38,278 కోట్లు అని, సీఏజీకి ఇచ్చిన లెక్కల ప్రకారం కార్పొరేషన్ అప్పులు రూ.2.48,677 కోట్లుగా పేర్కొన్నారు. పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ బకాయిలు రూ.36వేల కోట్లు అన్నారు.

రెండు కార్పొరేషన్లను ఉపయోగించి సభ పర్యవేక్షణ లేకుండా ఖర్చుపెట్టేశారన్నారు. మూడో కార్పొరేషన్ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ పెట్టారని, దీని పనేంటంటే రాష్ట్రంలో డబ్బులు ఎక్కడ ఉన్నాయో మొత్తం చూశారన్నారు. 25 ఏళ్ల భవిష్యత్తు ఆదాయాన్ని ఒకేసారి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం కాజేసిందని ఆరోపించారు. స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ పెట్టి రాష్ట్రంలో డబ్బులన్నీ మళ్లించేశారని విమర్శలు చేశారు.

టిడ్కోలో గత ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది రూ.25వేలు ఇస్తామని గొప్పలు చెప్పిందన్న పయ్యావుల.. ఇళ్ల లబ్ధిదారులకు గత ప్రభుత్వం బకాయిల జాబితా పెరుగుతూనే పోయిందన్నారు. లెక్కా పక్కా లేకుండా తమకు అనువైన బిల్లులే పేర్కొంటూ చెప్పేసుకుంటూ వచ్చారన్నారు. రూ.7 వేల కోట్లు అని చెప్పారని, లక్షా 14వేల కోట్లుగా తేలిందన్నారు.

మరోవైపు జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని పలువురు ఎమ్మెల్యేల ఆరోపణలు చేశారు. విచారణ జరిపించాలని ఎమ్మెల్యేలు కోరారు. గత ప్రభుత్వంలో హౌసింగ్ లో జరిగిన అవకతవకలపై ఇప్పటికే విచారణకు ఆదేశించామన్న మంత్రి పార్థసారథి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇవీ చదవండి: AP Assembly: ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ.. జగన్ వర్సెెస్ షర్మిల!
Volunteer: వాలంటీర్లకు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
Volunteers: వాలంటీర్లపై మాట మారుస్తున్నది ఎవరు? అసలు ఉద్యోగాల్లో లేరా?
Chandrababu on Volunteers: వాలంటీర్ వ్యవస్థపై పూటకోమాట.. రూ.10 వేలిస్తామంటున్న చంద్రబాబును నమ్మేదెవరు?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు