HomeAndhra PradeshAP Schools: ఏపీలో హైస్కూల్ స్టూడెంట్స్‌కు అలర్ట్.. టైమింగ్స్ పెంపు

AP Schools: ఏపీలో హైస్కూల్ స్టూడెంట్స్‌కు అలర్ట్.. టైమింగ్స్ పెంపు

AP Schools: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైస్కూలు విద్యార్థులకు అలర్ట్. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉన్న స్కూలు వేళలు మారబోతున్నాయి. AP Schools సాయంత్రం ఒక గంట పెంచి 5 గంటల వరకు స్కూళ్లు నిర్వహించేలా సర్కారు యోచిస్తోంది.

ఈ నేపథ్యంలోనే పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి రెండు పాఠశాలల్లో 5 గంటల వరకు స్కూలు నిర్వహించాలని తాజాగా ఆదేశాలు ఇచ్చింది కూటమి సర్కార్. ఎంపిక చేసిన బడుల్లో నవంబర్ 25 నుంచి 30 వరకు కొత్త విధానంలో స్కూళ్ల సమయాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సబ్జెక్టులు బోధించడంతో పిల్లలు నేర్చుకునేందుకే మరింత అదనపు సమయం కావాలని, అందుకే గంట సమయం పొడిగించామని, మిగతా వెయిటేజీలో ఎలాంటి మార్పులు ఉండవని విద్యా శాఖ వెల్లడించింది. పైలట్ ప్రాజెక్టు ఫీడ్ బ్యాక్ ఆధారంగా కూటమి సర్కార్ తదుపరి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.

స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT) సూచనలకు కట్టుబడి ఈ విద్యా సంవత్సరంలో 2024-25లో స్కూళ్ల సమయాలను మార్చాలని ప్రతిపాదించారు. ఒకే విధమైన పనిభారం, వెయిటేజీలతో, ప్రతి పీరియడ్ సమయాన్ని మాత్రమే పెంచాలని, తద్వారా ప్రతి టీచర్ సిలబస్‌ను పూర్తి చేసుకోవడంతో పాటు బోధన అభ్యాస ప్రక్రియకు సరిపడా సమయం ఇవ్వాలన్నది దీని వెనకున్న ప్రధాన ఉద్దేశం.

ఇవీ చదవండి: Education: కూటమి పాలనలో విద్యావ్యవస్థ సర్వనాశనం
CM Revanth on Education: 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు, 34,000 మంది టీచర్ల బదిలీ!
Foreign Education: విద్యా విధానం టఫ్‌గా ఉండే దేశాలు ఇవీ.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండోయ్‌!
Early Childhood Education: చిన్నారుల విద్యపై యూనిసెఫ్‌ రూపొందించిన ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సు ప్రారంభం
YS Jagan at INDIA Today Education Summit: కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైయస్‌ జగన్‌.. ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌తో కీలక అంశాల ప్రస్తావన
American Education: అందుబాటులో విదేశీ విద్య.. అమెరికా చదువులపై సందేహాలకు సమాధానాలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు