Education: కూటమి పాలనలో విద్యావ్యవస్థ సర్వనాశనం అయ్యిందని విద్యాశాఖ (Education) మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో ఆయన ప్రెస్‌మీట్ లో మాట్లాడారు. ఆయనేమన్నారో ముఖ్యాంశాలు ఇవీ..
– అధికారంలోకి వచ్చిన 5 నెలల తర్వాత నాలుగు నెలల కోసం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. ఎన్నికల్లో వారిచ్చిన హామీలు అమలు చేయబోవడం లేదన్నది తేటతెల్లం చేసింది. పథకాలకు చేసిన నామమాత్రపు, జీరో కేటాయింపులు దాన్ని రుజువు చేస్తున్నాయి.
– హామీల అమలుపై కూటమి నాయకుల చిత్తశుద్ధి చూస్తే ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లుగా ఉంది.
– చంద్రబాబు చెప్పే నాలెడ్జ్ ఎకానమీలో విద్యా వ్యవస్థకు స్థానం లేదా?.
– డ్రాపవుట్స్ తగ్గించి, బడుల్లో చేరే వారిని పెంచాలనే (జీఈఆర్–గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో) పెంచాలనే ఉద్దేశంతో తన మానస పుత్రికగా వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకానికి ప్రత్యామ్నాయంగా కూటమి ప్రభుత్వం చెప్పిన తల్లికి వందనం పథకం అమలు విషయంలో దారుణంగా విఫలమైంది.
– నాడు అమ్మ ఒడి పథకంలో 83 లక్షల మంది పిల్లలకు మేలు చేస్తూ, 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో మొత్తం రూ.26 వేల కోట్లు జమ చేశాం. అంత మంది పిల్లలకూ మేలు చేస్తామంటూ, ప్రకటించిన తల్లికి వందనం పథకానికి రూ. 12,450 కోట్లు కావాల్సి ఉంటే అందులో సగం కూడా కేటాయించకపోవడం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడం, విద్యావ్యవస్థను నాశనం చేయడమే కాకుండా ఓటేసిన తల్లులను వంచించడమే.
– నాడు–నేడు ద్వారా సుమారు 45 వేల గవర్నమెంట్ స్కూళ్లు, హాస్టళ్లు బాగు చేస్తే, ఇప్పుడు ఆ ఫలాలూ దూరం చేస్తున్నారు.
– స్కూళ్లలో వసతుల లేక ఏ ఒక్క విద్యార్థి విద్యకు దూరం కాకూడదన్న లక్ష్యంతో పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలు కూడా బాగా చదువుకోవాలన్న సంకల్పంతో నాడు–నేడు కార్యక్రమంలో గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ బోర్డులు, టోటల్ ఫర్నీచర్, స్కూళ్లకు పెయింటింగ్, లైట్స్, ఫ్యాన్స్, రన్నింగ్ వాటర్‌తో కూడిన టాయిలెట్లు, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, స్కూళ్లకు కాంపౌండ్స్, కిచెన్ వంటి అన్ని సదుపాయాలు కల్పించాం.
– అదే విధంగా పిల్లలకు ఇంగ్లిష్ మీడియమ్‌లో బోధన, బైలింగ్వుల్ టెక్స్‌ట్‌బుక్స్, టోఫెల్ శిక్షణ, ఐబీ కరికులమ్ అమలు, 8వ తరగతి పిల్లలకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు, రోజుకో పౌష్టికాహార మెనూతో గోరుముద్ద, స్మార్ట్ టీవీలు.. ఇలా దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి, వేగంగా అడుగులు ముందుకు వేశాం. వాటిలో దేనికీ ఈ బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించలేదు.
– డీఎస్సీ రాయడానికి ఆరు నెలలుగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల సహనాన్ని పరీక్షించేలా మరోసారి వచ్చే విద్యాసంవత్సరం అమలు చేస్తామని వారి ఆశలపై నీళ్లు చల్లారు.
– 2019–24 మధ్య 15 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. 1998 డీఎస్సీ పోస్టుల్లో 4,059 మందికి ఉద్యోగం కల్పించాం. 2008 డీఎస్సీ పోస్టింగుల్లో 2193 మందికి న్యాయం చేశాం.
– గతంలో చంద్రబాబు ప్రభుత్వం 2018 డీఎస్సీ పోస్టింగుల్లో కేవలం 300 పోస్టులకు నియామకం చేసి వదిలేస్తే కోర్టు కేసులన్నీ క్లియర్ చేసి సుమారు 6,954 మందికి పోస్టింగులు ఇవ్వడం జరిగింది.
– 2019 స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 602 మందికి పోస్టింగులు ఇవ్వడం జరిగింది. కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు 1200, 2024 డీఎస్సీ నోటిఫికేషన్‌లో 6100 పోస్టులతో కలిపి వైఎస్ జగన్ హయాంలో ఐదేళ్లలో సుమారు 21,108 టీచర్ ఉద్యోగాల భర్తీకి అడుగులు పడిన మాట వాస్తవం కాదా?.
– పేదరికం చదువుకు అడ్డు కాకూడదని దివంగత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే, ఆయన తనయుడు వైఎస్ జగన్ రైట్ టు ఇంగ్లిష్ ఎడ్యుకేషన్ అందించాలని విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు శ్రీకారం చుట్టారు.
– విద్యాదీవెన, వసతి దీవెన కోసం మొత్తం సుమారు రూ.5 వేల కోట్లు పెండింగ్ ఉంటే.. బడ్జెట్‌లో చేసిన కేటాయింపులెన్ని?
– గురుకులాలు, ట్రిపుల్ ఐటీల్లో కలుషితాహారంతో వేలాది విద్యార్ధులు ఆస్పత్రుల పాలయ్యారంటే ఎంత దారుణంగా పరిస్థితులున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నారు!.
– అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలను తీర్చిదిద్దాలన్న వైఎస్ జగన్ ఆశయానికి తూట్లు పొడిచి విద్యావ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఇది భావితరాలకు తీరని నష్టం చేస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గుర్తించాలి. జగన్ మీద కోపాన్ని పిల్లల మీద చూపించొద్దని హితవు పలుకుతున్నాం.
– వాస్తవాలను వక్రీకరించి రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, మరో శ్రీలంక అయిపోతోందని తప్పుడు ప్రచారం చేశారు. అలా మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజలను మోసం చేశారు. అయితే ఇది ఎంతో కాలం కొనసాగదని గుర్తుంచుకొండి.
ఇవీ చదవండి: CM Revanth on Education: 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు, 34,000 మంది టీచర్ల బదిలీ!
IIIT-Basara: హృదయవిదారకం.. బాసర IIIT విద్యార్థిని స్వాతి ప్రియ సూసైడ్ నోట్..
University: విశ్వవిద్యాలయాల ప్రక్షాళన.. తెలంగాణ సర్కార్ కీలక అడుగులు?
Crime News: విద్యార్థిని తొడపై కొరికిన కీచక టీచర్! చెప్పుకోలేని చోట తాకుతూ..
AP Political News: దీపావళికి గ్యాస్ బండ ఫ్రీగా ఇస్తామని విద్యుత్ చార్జీలతో బాదుడా?
