HomeAndhra PradeshAP Assembly: ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ.. జగన్ వర్సెెస్ షర్మిల!

AP Assembly: ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ.. జగన్ వర్సెెస్ షర్మిల!

AP Assembly: అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం లేదన్న ప్రస్తావనలో (AP Assembly) ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ నిన్న మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన సోదరి, పీసీసీ చీఫ్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ జగన్ ఏమన్నారు? షర్మిల ఎలా కౌంటర్ ఇచ్చారంటే..

మొదట షర్మిల ఏమన్నారు?
‘‘జగన్ మీకిది భావ్యమేనా..? మిమ్మల్ని గెలిపించింది ప్రజలు. మీకు భాధ్యత లేదా..? ప్రతిపక్ష హోదా లేకపోతే మైకూ ఇవ్వరని చెబుతున్నారు. మైకు ఇవ్వకపోవడం మీ స్వయం కృతాపారథం. ఒకప్పుడు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 11 సీట్లు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు..? మీ అక్రమాలను,అవినీతిని ప్రజలు గమనించారు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారు. మీకు ప్రజల తీర్పు మీద గౌరవం ఉండాలి కదా. అసెంబ్లీకి పోను అనడం మీ అహకారం, అజ్ఞానానికి నిదర్శనం. దీనిపై జగన్ సమాధానం చెప్పాలి.

అలాగే వైసీపీ ఎమ్మెల్యేలను అడుగుతున్నాం. మీకు ప్రజలు ఓట్లు వేశారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ అసెంబ్లీ. మీకు ఆలోచన లేదా..? ప్రజలు మీకు ఓట్లు వేసింది అసెంబ్లీ వెళ్ళడానికి కదా. అసెంబ్లీకి పోకుంటే మీరు ప్రజలను వెన్నుపోటు పొడిచినట్లు కాదా ? ప్రజలను మోసం చేసినట్లు కాదా..? జగన్‌కి అంటే అహంకారం ఉంది. మీకు ఏమయ్యింది. ఇంట్లో కూర్చొని మాట్లాడటానికి కాదు కదా ప్రజలు మీకు ఓట్లు వేసింది..? మీ అజ్ఞానం ఏంటో బయటపడింది. వైసీపీ ఎమ్మెల్యేలకు ఇది భావ్యం కాదు.

బడ్జెట్ ప్రవేశపెడుతుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఎవరు..? ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేది ఎవరు..? సర్కార్ దందాలను ప్రశ్నించేది ఎవరు..? ఎన్నికల్లో నిలబడ్డప్పుడు అసెంబ్లీకి పోను అని మీరు చెప్పారా..? మీకు దైర్యం సామర్థ్యం లేకుంటే రాజీనామా చేయండి. వైసీపీ ఎమ్మెల్యేలకు లేఖ రాస్తున్నాం. మీరు అసెంబ్లీకి వెళ్ళకుంటే రాజీనామాలు చేయండి. లేదంటే స్వతంత్ర అభ్యర్థులుగా అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలను లేవనెత్తండి అని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం.’’ అని షర్మిల ట్వీట్ చేశారు. <blockquote class=”twitter-tweet” data-media-max-width=”560″><p lang=”te” dir=”ltr”>జగన్ మీకిది భావ్యమేనా..? మిమ్మల్ని గెలిపించింది ప్రజలు. మీకు భాధ్యత లేదా..? ప్రతిపక్ష హోదా లేకపోతే మైకూ ఇవ్వరని చెబుతున్నారు. మైకు ఇవ్వకపోవడం మీ స్వయం కృతాపారథం. ఒకప్పుడు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 11 సీట్లు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు..? మీ అక్రమాలను,అవినీతిని ప్రజలు గమనించారు కాబట్టే…

నిన్న ప్రెస్‌మీట్‌లో జగన్ ఏమన్నారంటే..
‘‘నా సోదరి గురించి మాట్లాడటానికి ఇది వేదిక కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 1.7 శాతం ఓటు షేర్ మాత్రమే ఉంది. ఏ మాత్రం ప్రభావం చూపని ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ కాంగ్రెస్. అలాంటి పార్టీ గురించి మాట్లాడటం అనవసరం.’’ అని జగన్ కామెంట్ చేశారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు జగన్ ఇలా స్పందించారు.

కౌంటర్ ఇచ్చిన షర్మిల..
‘‘ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది YCP అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి తీరు. బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కాని బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ.. వైసీపీ కంటే ముందే చెప్పింది. ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాం. ఇదే విషయాన్ని, మేం ముందే చెప్పిన అంశాలనే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మీకు మాకు పెద్ద తేడా లేదు.

జగన్ మోహన్ రెడ్డి గారికి 38 శాతం వచ్చినా.. అసెంబ్లీకి వెళ్ళనప్పుడు, మీకు మాకు తేడా లేదు. 38 శాతం ఓట్ షేర్ పెట్టుకొని అసెంబ్లీకి పోని YCPని నిజానికి ఒక “ఇన్ సిగ్నిఫికెంట్”పార్టీగా మార్చింది జగన్ మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీలో అడుగు పెట్టలేని, ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని, పాలకపక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని, అసమర్థ వైసీపీ ఇవ్వాళ రాష్ట్రంలో అసలైన “ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ”.

ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు.. సొంత మైకుల ముందు కాదు..అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని. మీకు చిత్తశుద్ది ఉంటే.. నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయండి. ప్రతిపక్షం కాకపోయినా..11 మంది ప్రజాపక్షం అనిపించుకోండి. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయండి. ఎన్నికలకు వెళ్ళండి. అప్పుడు ఎవరు ఇన్ సిగ్నిఫికెంట్.. ఎవరు ఇంపార్టెంట్ తేలుతుంది కదా.. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి.. లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలి. చంద్రబాబు గారి సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయండి.’’ అని షర్మిల ట్వీట్ చేశారు.

ఇవీ చదవండి: Sharmila: సాయిరెడ్డికి షర్మిల కౌంటర్.. మీ బిడ్డలపై ప్రమాణం చేయగలరా?
YS Sharmila: షర్మిల కంట తడి.. అన్నపై హాట్ కామెంట్స్.. దౌర్భాగ్యుడు, శాడిస్ట్ అంటూ… పూర్తి ప్రసంగం ఇదీ
Jagan longest press meet: ఆర్గనైజ్డ్‌ క్రిమినల్‌లా చంద్రబాబు వ్యవహారం.. రాష్ట్ర అప్పులు, బడ్జెట్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
Jagan and Sharmila: కుటుంబ తగాదాలు రాజకీయం చేయొద్దు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు