Cricket Australia: భారత టెస్టు జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉండొచ్చు.. కానీ విరాట్ కోహ్లీ ఫీవర్ ఆస్ట్రేలియన్ మీడియాను పట్టుకుంది. మంగళవారం ఉదయం, భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ హీరో అనేక ఆస్ట్రేలియన్ వార్తాపత్రికల్లో (Cricket Australia) మొదటి పేజీలలో కనిపించాడు. ఇది క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది.
విరాట్ ఫొటోలు చాలా వార్తాపత్రికలలో డామినేట్ చేయగా, ఇప్పుడిప్పుడే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్న వర్ధమాన స్టార్ యశస్వి జైస్వాల్.. ఆస్ట్రేలియా పత్రికల్లో ప్రముఖంగా కనిపించాడు.
కొన్ని పేపర్ల మొదటి పేజీలు హిందీలో “యుగోన్ కి లడాయి” అని రాశారు. కొన్ని బోల్డ్ హిందీ హెడ్‌లైన్‌లను కూడా పెట్టారు. మరోవైపు జైస్వాల్‌ను “నవమ్ రాజా” లేదా “ది న్యూ కింగ్”గా అభివర్ణిస్తూ విలేకరులు రాయడం కొసమెరుపు.
కోహ్లీకి ఆస్ట్రేలియాతో, ఆ దేశ ప్రజలతో అవినాభావ సంబంధం కలిగి ఉందంటారు. ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్లు కూడా విరాట్ గురించి మాట్లాడకుండా ఉండేందుకు చాలా కష్టపడుతున్నారు. ఇటీవల, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జట్టులో కోహ్లీ స్థానం గురించి ప్రశ్నించగా, అతను భారత జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ నుంచి తగిన సమాధానం అందుకున్నాడు.
పాంటింగ్ ఇటీవల కోహ్లి ఫామ్‌పై కామెంట్లు చేశాడు. ఐదేళ్లలో కేవలం రెండు సెంచరీలు చేసిన మరే ఇతర ఆటగాడు జట్టులో మనుగడ సాగించేవాడు కాదని సూచించాడు.
ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా బయల్దేరే ముందు మీడియాతో మాట్లాడిన గంభీర్.. కోహ్లీ, రోహిత్‌ల ఫామ్‌పై ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. భారత క్రికెట్‌పై పాంటింగ్ అభిప్రాయాలను ‘అసంబద్ధం’ అని పేర్కొన్నాడు. రెండు పెద్ద జట్ల మధ్య చాలా ఆసక్తికరంగా పోరు ఉండబోతోందని చెప్పాడు.
“రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచించాలి. అతనికి భారత క్రికెట్ పట్ల ఎలాంటి ఆందోళనలు ఉన్నాయి? విరాట్, రోహిత్ చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్. వారు భారత క్రికెట్ కోసం చాలా సాధించారు. సాధిస్తూనే ఉంటారు.” అని గంభీర్ మీడియా సమావేశంలో కామెంట్స్ చేశాడు.
“రోహిత్, కోహ్లీ.. ఇద్దరూ ఇప్పటికీ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. గేమ్ పట్ల ఆసక్తిగా ఉన్నారు. వారు ఇంకా చాలా ఎక్కువ సాధించాలనుకుంటున్నారు. అది చాలా ముఖ్యమైనది. ఆ డ్రెస్సింగ్ రూమ్‌లోని వారి హంగర్ నాకు, మొత్తం టీమ్ సభ్యులకూ తెలుసు. ఆ డ్రెస్సింగ్ రూమ్‌లో నేను కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాను’’ అని గంభీర్ పేర్కొన్నాడు.
ఇవీ చదవండి: Gautam Gambhir: కోహ్లీ పరుగుల దాహం.. గంభీర్ ఏమన్నాడంటే..
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత్.. పాకిస్థాన్‌కు వెళ్లదు
Virat Kohli: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ దేశీయ క్రికెట్‌కు తిరిగి వెళ్లండి!
Virat Kohli: కోహ్లీ ప్రపంచ రికార్డు.. టెస్టు చరిత్రలో సంచలనం
