HomeCrime NewsUK PM: హిందువుల మనోభావాలను కించపర్చిన యూకే ప్రధాని!

UK PM: హిందువుల మనోభావాలను కించపర్చిన యూకే ప్రధాని!

UK PM: యూకే ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఏర్పాటు చేసిన దీపావళి పార్టీలో మాంసం, మద్యం వడ్డించారు. ఇది కొంతమంది బ్రిటిష్ హిందువులను (UK PM) కించపరిచింది. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జరిగిన వేడుకలో సంఘం నాయకులు, అగ్ర రాజకీయ నాయకులు పాల్గొన్నారు. దీపాలు వెలిగించడం, కూచిపూడి నృత్య ప్రదర్శన, స్టార్మర్ ప్రసంగం ఉన్నాయి.

అయితే డిన్నర్ మెనూలో మద్యం, మాంసాహార వంటకాలు ఉన్నాయని తెలుసుకున్న కొందరు బ్రిటిష్ హిందువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాంబ్ కబాబ్‌లు, బీర్, వైన్‌లను అతిథులకు అందించినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. గత ఏడాది రిషి సునక్ దీపావళి వేడుకను నిర్వహించినప్పుడు మాంసం, మద్యం మెనూలో లేవు.

ప్రముఖ బ్రిటిష్ హిందూ పండిట్ సతీష్ కె.శర్మ, ప్రధానమంత్రి కార్యాలయంపై విమర్శలు చేశారు. సెన్సిటివ్ అంశాలను పట్టించుకోలేదని ఆరోపించారు.

“గత 14 సంవత్సరాలుగా, 10 డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి వేడుకలు మాంసం, మద్యం లేకుండా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం వేడుకలు మత్తులో మునిగిపోవడం దారుణం. మాంసాహారం, మందుతో ఆధిపత్యం కోసం జరిగిన ఘటనగా కనిపించింది. నేను నిరాశ చెందాను. చాలా ఆశ్చర్యపోయాను. ఇది ఒక విషాదం. ప్రధానమంత్రి సలహాదారులు చాలా అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారు” అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియో ప్రకటనలో తెలిపారు.

బ్రిటీష్ హిందువులు, భారతీయుల సామాజిక ఉద్యమం అయిన ఇన్‌సైట్ యూకే, “పవిత్రమైన వేడుకను మాంసం, మద్యంతో చెడగొట్టారు” అని పేర్కొంది. మతపరమైన భావాలపై 10 డౌనింగ్ స్ట్రీట్ అధికారులకు సలహా ఇవ్వాలని సూచించింది.

మెనూ ఎంపిక దీపావళికి సంబంధించిన మతపరమైన సంప్రదాయాల పట్ల అవగాహన లేక గౌరవం పోయేలా చేసిందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలిశాయి. భవిష్యత్ ఈవెంట్‌లలో అయినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. అయితే, దీనిపై 10 డౌనింగ్ స్ట్రీట్ ఇంకా స్పందించలేదు.

ఇవీ చదవండి: Complaint: ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోతే ఏం చేయాలి?
A23a: ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌బర్గ్‌ ఎందుకు కదులుతోంది?
Maharashtra: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమా? శిండేకు పదవీ గండం, ఆశాభంగం?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు