HomeSportsInd vs NZ Test: 1934 తర్వాత తొలిసారి.. కివీస్‌ చేతిలో 3-0తో భారత్ ఓటమి!

Ind vs NZ Test: 1934 తర్వాత తొలిసారి.. కివీస్‌ చేతిలో 3-0తో భారత్ ఓటమి!

Ind vs NZ Test: టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య హై డ్రమాటిక్ గా నడిచిన 3వ టెస్టులో కివీస్ పైచేయి సాధించింది. ఫలితంగా కివీస్ చారిత్రక విజయాన్ని, సిరీస్ వైట్ వాష్ ను సాకారం చేసుకుంది. భారత ఉపఖండంలో మొట్టమొదటి సిరీస్ స్వీప్‌ను (Ind vs NZ Test) సాధించడంతో టెస్టు సిరీస్ ముగించింది.

రిషబ్ పంత్ బ్యాటింగ్ చేసేంత వరకు కివీస్‌పై విజయాన్ని నమ్ముకున్న భారత్.. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ వివాదాస్పద ఔట్ తో ఇండియా ఆశలు గల్లంతయ్యాయి. టీమిండియా బ్యాటింగ్ యూనిట్‌ పేకాట ముక్కల్లా కూలిపోయింది. న్యూజిలాండ్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో స్వదేశంలో భారత్‌ను 3-0తో ఓడించిన మొదటి జట్టుగా చరిత్రలో నిలిచిపోయింది.

1933-34 సీజన్‌లో ఇంగ్లండ్ తిరిగి దేశంలో పర్యటించినప్పుడు భారత్ మొదటిసారిగా 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆడింది. ఈ మ్యాచ్ స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ కాలంలో జరిగింది. ఈ సిరీస్‌లో భారత్ 2-0తో పర్యాటక దేశం చేతిలో ఓడిపోయింది.

న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో, భారత స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా మరియు రవిచంద్రన్ అశ్విన్ 8 వికెట్లు తీయడంతో బ్లాక్‌క్యాప్స్ 174 పరుగులకు ఆలౌట్ అయ్యారు.

ముంబైలో థ్రిల్లింగ్ విజయం తర్వాత న్యూజిలాండ్ భారత్‌పై 3-0 వైట్‌వాష్‌తో అద్భుతమైన టెస్ట్ సిరీస్‌ను ముగించింది.

అయితే, ఛేజింగ్ లో భారత జట్టు పోరాడింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ స్వల్ప స్కోర్లకే నిష్క్రమించడంతో ఆతిథ్య జట్టు కేవలం 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.

రిషబ్ పంత్ వివాదాస్పద ఔట్ అవ్వడానికి ముందు 57 బంతుల్లో 64 పరుగులు చేయాల్సి ఉంది. ఆర్.అశ్విన్ మరియు వాషింగ్టన్ సుందర్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని చూశారు కానీ, అజాజ్ పటేల్ మరియు గ్లెన్ ఫిలిప్స్‌లు దీన్ని బ్రేక్ చేశారు. మొత్తంగా టీమిండియాకరు ఘోర పరాభవం ఎదురైంది.

ఇవీ చదవండి: Indian Premier League: ఐపీఎల్ 2025 రిటెన్షన్ ఫైనల్ లిస్టు ఇదే
IND vs NZ: 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఓటమి.. రెండో టెస్టు విశేషాలు
IND vs NZ: టీమిండియా మరోసారి వైఫల్యం.. తిరుగులేని ఆధిక్యంలో కివీస్
IND vs NZ: టీమిండియాకు ఏమైంది? మరీ 46 పరుగులకే ఆలౌటా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు