Diwali Wishes: దీపావళి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ సీఎం వైయస్ జగన్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు (Diwali Wishes) తెలిపారు. ఆనందాల వెలుగులు నింపాలని వారిద్దరూ కోరుకున్నారు.
చీకట్లను పారద్రోలినట్లు: సీబీఎన్
‘‘తెలుగు ప్రజలందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు. నరకాసుర వధ తర్వాత ఇంటింటా దీపాలు వెలిగించుకుని సంతోషంగా జరుపుకునే వెలుగుల పండుగ ఇది. ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా మన చుట్టూ ఉన్న చీకట్లను పారద్రోలినట్లుగా ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా ‘దీపం 2.0’ పథకంతో ఈ దీపావళి పండుగను మరింత కాంతివంతం చేస్తున్నాము.
తెలుగింటి ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూసేందుకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలెండర్లను ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం ముఖ్యోద్దేశ్యం. అర్హులైన ఆడబిడ్డలు ఇప్పటికే ‘దీపం 2.0’ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇది సంతోషం కలిగించే విషయం. మీ నుంచి వస్తున్న స్పందనతో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసే స్ఫూర్తిని పొందుతున్నాము. ఈ ఆనంద దీపావళి పండుగ రాష్ట్ర ప్రజల జీవితంలో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని సీఎం చంద్రబాబు దీపావళి శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు.
ఆనందాల వెలుగులు నింపాలి: జగన్
మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని మాజీ ముఖ్యమంత్రి కోరుకున్నారు.
దీపావళి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు.
దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు.
ఇవీ చదవండి: AP Political News: దీపావళికి గ్యాస్ బండ ఫ్రీగా ఇస్తామని విద్యుత్ చార్జీలతో బాదుడా?
Disha Patani: దీపావళి వైబ్స్.. పండుగ వేళ దిశ పటాని గ్లామర్ షో
Women: ఏపీలో మహిళలు, చిన్నారులపై దాడులు.. ఎన్‌డబ్ల్యూసీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీ జోక్యం!
Free Gas Cylinder: మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక అప్ డేట్!
YS Sharmila: ఒక్క సూపర్ సిక్స్ అయినా అమలు చేస్తారనుకున్నాం
