HomeAndhra PradeshPawan: ‘సరస్వతి పవర్’లో అటవీ భూములపై పవన్ వాకబు

Pawan: ‘సరస్వతి పవర్’లో అటవీ భూములపై పవన్ వాకబు

Pawan: మాజీ సీఎం జగన్ కుటుంబ ఆస్తి తగాదాలపై తాజాగా రచ్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన సరస్వతీ పవర్ భూముల వ్యవహారంపై అందరి దృష్టి పడింది. సరస్వతీ పవర్ భూములకు సంబంధించి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan) నిన్న ప్రస్తావించడం గమనార్హం.

సరస్వతీ పవర్ భూములకు సంబంధించి జల వనరులున్నాయా? పర్యావరణ అనుమతులు ఎలా పొందారన్న అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ వాకబు చేశారు.

పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో అటవీ భూములు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటి విస్తీర్ణం ఎంత ఉందో నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ అధికారులను, పల్నాడు జిల్లా యంత్రాంగాన్నీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

ఈ సంస్థకు 1515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయనే వార్తలు వచ్చాయని, ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి అధికార యంత్రాంగంతో చర్చించినట్లు తెలుస్తోంది. ఆ సంస్థకు చెందిన భూముల్లో ప్రభుత్వ భూములు, జల వనరులు ఏ మేరకు ఉన్నాయో తెలియచేయడంతో పాటు, అటవీ భూములు ఏ మేరకు ఉన్నాయో సమగ్రంగా పరిశీలించవలసిన అవసరం ఉందని అధికారులకు సూచనలు చేశారు.

వాగులు, వంకలు, కొండలు ఉన్నందున ఆ సంస్థకు పర్యావరణ అనుమతులు ఏ విధంగా పొందారో తెలియచేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ అంశంపై అటవీ, రెవెన్యూ, పీసీబీ ఉన్నతాధికారులతో త్వరలో ఉప ముఖ్యమంత్రి సమీక్షించాలని నిర్ణయించారని తెలుస్తోంది.

ఇవీ చదవండి: Telugu News: జగన్ కుటుంబ వివాదంపై సుబ్బారెడ్డి, పేర్ని నాని సంచలన ప్రెస్ మీట్!
YS Jagan Clarity: ఫ్యామిలీ ఆస్తుల గొడవపై స్పష్టత ఇచ్చిన జగన్!
Jagan and Sharmila: కుటుంబ తగాదాలు రాజకీయం చేయొద్దు
Sharmila on Jagan: షర్మిల కౌంటర్.. ఇది సామాన్యం కాదు జగన్ సార్!
CBN on Jagan Family issue: జగన్ ఫ్యామిలీ ఇష్యూపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Jagan in Gurla: ఘర్ ఘర్ కీ కహానీలే.. ఆస్తుల వివాదంపై జగన్ హాట్ కామెంట్స్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు