YS Jagan at GGH: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని దుయ్యబట్టారు. తెనాలికి చెందిన యువతిపై టీడీపీ కార్యకర్త దాష్టీకం చేయడంతో నిన్న సాయంత్రం మృతి చెందింది. ఆ బాధిత కుటుంబాన్ని జగన్ ఇవాళ పరామర్శించారు. అనంతరం గుంటూరు జీజీహెచ్ (YS Jagan at GGH) వద్ద మీడియాతో జగన్ మాట్లాడారు. ఆయనేమన్నారో ముఖ్యాంశాలు ఇవీ..
రాష్ట్రంలో ఈ రోజు ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చెప్పడానికి, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎలా దిగజారి చూడానికి నా దళిత చెల్లి పరిస్థితిని చూస్తే అందరికీ అర్థమవుతుంది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ అక్కచెల్లెమ్మకు ఆపద వచ్చినా మేము ఉన్నామని భరోసా ఇచ్చే పరిస్థితులు ఉండేవి. (YS Jagan at GGH)
ఏ అక్కచెల్లెమ్మ ఆపదలో ఉన్నా దిశ యాప్ రక్షించేంది. ఎస్ వో ఎస్ బటన్ నొక్కినా, షేక్ చేసినా వెంటనే పోలీసులకు సమాచారం అందడం, వాళ్లువెంటనే బాధితుల దగ్గరికి వచ్చి కాపాడే పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే చేసిన వాడు మనవాడు అయితే చాలు వాడు ఏం చేసినా పర్వాలేదు. కవరప్ చేయడానికి, దొంగ కేసులు పెట్టడానికి ప్రభుత్వం రెడీగా ఉందనే సంకేతం ఇస్తోంది. ఇక్కడ దయనీయమైన ఘటన జరిగినప్పుడు, ప్రభుత్వం ఏ మాదిరిగా స్పందిస్తోందన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.
నా చెల్లెలు తాను చేస్తున్నా ఉద్యోగం ప్రదేశం నుంచి నవీన్ అనే వ్యక్తి ఆ పాపను కార్లో ఎక్కించుకుని పోయి, తాను తనతో పాటు ఇంకా మృగాలుగా ప్రవర్తించిన మరికొంతమంది అతి దారుణంగా నా చెల్లెలిని ఇబ్బంది పెట్టారు. ఫిజికల్ గా అబ్యూజ్ చేయడమే కాకుండా, ప్రైవేట్ పార్ట్స్ లో కూడా బ్లీడింగ్ అవుతోందని, సెక్స్‌వల్ అబ్యూజ్ చేశారని తెలుస్తోంది. ఈ నవీన్ అనే అతనికి చంద్రబాబుతో పాటు, స్థానిక ఎంపీతో మంచి సంబంధాలు ఉన్నాయి.
నవీన్ అనే వ్యక్తి ఆస్పత్రికి తీసుకువచ్చి, ప్రేషెంట్‌ను రక రకాల ఆస్పత్రులు తిప్పి.. చివరకు గవర్నమెంట్ జీజీహెచ్ లోచేర్పించి ఆ పాప తల్లి కళ్లెదుటే జారుకున్నారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటి? మేము తోడుగా ఉన్నాయని భరోసా ఇవ్వాలి కదా. కళ్లెదుట ఇది కనిపిస్తున్నప్పుడు ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రభుత్వం?
బాధిత కుటుంబానికి మంచి ప్యాకేజీ ఇచ్చి ఎందుకు తోడుగా నిలబడలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వాడిని ఎందుకు కాపాడుకుంటూ వస్తోంది? ఇంతటి హేయమైన చర్య మరొకటి ఉంటుందా? నేను వస్తున్నానని తెలిశాక.. ఆలపాటి రాజా వచ్చాడట. అంతకు ముందు ఎవరూ రాలేదు. తెనాలి ఎమ్మెల్యే, మంత్రి కనీసం చూడడానికి కూడా రాలేదు. హోంమంత్రి కానీ, ఇంకొకరు కానీ స్పందించిన దాఖలాలు లేవు. చేసినవాడు వాళ్ల మనిషి కాబట్టి నిసిగ్గుగా కాపాడే పరిస్థితి కనిపిస్తోంది. (YS Jagan at GGH)
నవీన్ అనే బాధ్యుడు.. తాను తీసుకున్న ఫోటోలు చంద్రబాబు కండువా కప్పుతున్నాడు చూడండి. స్థానిక ఎంపీకి అత్యంత సన్నిహితుడు, ఇతన్ని ప్రభుత్వం వెనుకేసుకొస్తోంది. తప్పే జరగలేదని తప్పుడు ప్రచారంచేయాలని చూస్తోంది ఈ ప్రభుత్వం. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ప్రతిచోటా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడి నుంచి బద్వేలుకు నేను పోతున్నా. బద్వేల్ కూడా ఇలాంటి ఘటనే.
బద్వేలుకు నేను పోతా ఉన్నా.. బద్వేలులో కూడా ఇలాంటి ఘటనే.. 16 ఏళ్ల బాలిక అక్కడ.. అత్యాచారం చేసి పెట్రోలు పోసి అగ్గిపుల్ల వేసి కాల్చి వదిలేసిపోయిన పరిస్థితులు. శ్రీకాకుళంలో ఇద్దరు బాలికలపై అతి దారుణంగా వారి కూల్ డ్రింక్స్ లో మత్తు మందు కలిపి అత్యాచారం చేసిన ఘటన. చేసినవారు టీడీపీ ప్రబుద్ధులు. పలాసలో టీడీపీకి చెందిన ఈ నాయకులు, వారి పిల్లలు బరి తెగించి.. మేము ఏం చేసినా తమను ఎవరూ తాకలేరన్న ధీమాతో.. ఇద్దరు ఆడపిల్లల్ని బర్త డే పార్టీ పేరుతో పిలిచి అత్యాచారం చేసిన ఘటన. మరి దాన్ని ఒప్పుకుని, క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రభుత్వం ఏం చేస్తోంది. అక్కడ కూడా పంచాయతీలు చేయడానికి ప్రయత్నిస్తోంది. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు పంచాయతీలు చేసి దాన్ని బ్రషప్ చేయాలని చూస్తా ఉంది. (YS Jagan at GGH)
పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు, తన భార్య కార్పొరేటర్, టీడీపీ నాయకులు 16 ఏళ్ల బాలికను మత్తు మందు ఇచ్చి ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడితే.. చెత్త ఏరుకునేందుకు వచ్చ్చిన వ్యక్తులు గమనించి ఆ బాలిక ప్రాణాలను కాపాడారు. లోకేష్ తో ఆ పెద్ద మనిషి ఫొటో, అచ్చెన్నాయుడితో ఆ మనిషి ఫొటో.. డిప్యూటీ సీఎంనని చెప్పుకునే పవన్ కల్యాణ్ ఈ నియోజకవర్గానికి పాతినిథ్యం వహిస్తున్నాడు. తన కనీసం ఆ పాప ఇంటికన్నా వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించాడా? ఆ పాపను పరామర్శించడానికి కూడా ఎవ్వరే పోరు. (YS Jagan at GGH)
హిందూపురంలో దసరా పండుగ నాడు అత్తాకోడళ్లను దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. కనీసం మూడు రోజుల పాటు ఆ నిందితులను అరెస్టు చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం ఆ కుటుంబాన్ని కనీసం చూడడానికి కూడా పోడు. అనకాపల్లి నియోజకవర్గం రాంబిల్లి మండలం కుప్పగొండుపాలెంలో 9వ తరగతి చదివే బాలికను టీడీపీ నాయకుడు ప్రేమోన్మాది సురేష్ నరికి చంపేశాడు. తనను వేధిస్తున్నాడని ఆ బాలిక ఫిర్యాదు చేస్తే జైలుకు కూడా వెళ్లాడు ఆ నిందితుడు. తర్వాత బెయిల్ పై బయటికి వచ్చాడు. మళ్లీ బెదిరించడం మొదలుపెట్టాడు. దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదులు చేసినా.,. రెడ్ బుక్ పాలనలో నిమగ్నమైన పోలీసులు టీడీపీ నాయకుల దౌర్జన్యాలను అరికట్టలేకపోయారు. చివరికి ఆ టీడీపీ ప్రేమోన్మాది ఆ బాలికను దారుణంగా చంపేశాడు.
నేను అడుగుతున్నా…చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నర నెలల్లోనే 77 మంది మహిళలు, బాలికలపై దారుణమైన అత్యాచారాలు. 7 మంది హత్యకు గురయ్యారు. ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు. ఇంతటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో కనపడతాఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకుంటోందా అని అడుగుతున్నా.
రాష్ట్రంలో జరుగున్నది ఏంటంటే.. రెడ్ బుక్ పాలన.. టీడీపీ వాళ్లు ఏ తప్పులు చేసినా.. మీరు చేయండి తప్పులు, మేము వెనకేసుకొస్తామంటూ.. మీకేమీ జరగనివ్వం. మీకు సపోర్టు చేస్తామని చంద్రబాబు దగ్గరుండి స్వయంగా ప్రోత్సహిస్తున్న పరిస్థితులు. ఇలా జరుగుతూ లా అండ్ ఆర్డర్ ఏ స్థాయికి దిగజారిపోతా ఉందో గమనించమని కోరతా ఉన్నా.
వైయస్సార్ సీపీ హయాంలో దిశ యాప్ తీసుకువచ్చి. కోటి 56 లక్షల మంది అక్క చెల్లెమ్మల ఫోన్ లలో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలు ఎస్ ఓ ఎస్ బటన్ నొక్కినా.. ఫోన్ ను షేక్ చేసినా.. వెంటనే బాధితులకు ఫోన్ వచ్చేది. అక్క చెల్లెమ్మలు ఆపదలో ఉన్నామని చెప్పినా.. ఫోన్ ఎత్తలేకపోయినా .. పది నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి వచ్చి మేము తోడుగా నిలబడే పరిస్థితి. దిశ యాప్ ద్వారా 31,607 మహిళలు, బాలికలను గతంలో వైసీపీ ప్రభుత్వం కాపాడింది.
ఎప్పుడూ చూడని విధంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ప్రతి జిల్లాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, 900 బైక్ లు, 163 బొలెరోలు.. మహిళల రక్షణ కోసమే కేటాయించడం జరిగింది. దీని కోసం 18 దిశ క్రైం మేనేజ్ మెంట్ వాహనాలు కూడా క్రైంలు ఛేదించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అత్యుత్తమ పోలీసింగ్ కోసం జాతీయ స్థాయిలో కేంద్రం నుంచి దిశ యాప్ కు 19 అవార్డులు వచ్చాయి. అంత గొప్పగా ఉన్నదిశ వ్యవస్థను, దిశ యాప్ పై టీడీపీ ఏం చేస్తోంది.
నారా లోకేష్.. బుద్ధి తక్కువ అంటారు ఈ మనిషికి, జ్ఞానం తక్కువ అంటారు ఈ మనిషి, పప్పు అంటారు ఈ మనిషిని. దిశ యాప్, దిశ చట్టం ప్రతిని బుద్ధి ఉన్నవాడు ఎవడైనా కాల్చివేస్తాడా చెప్పండి?ఈ బుద్ధిలేని, పప్పులాంటి ఈ మనిషికి ఎవరు తోడంటే.. హోం మినిష్టర్.. ఆమెకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా.. ? ఇద్దరూ కలిసి దిశ చట్టం ప్రతిని కాల్చివేస్తున్న ఫొటో ఇది.
ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి. ఒకవైపున అక్కచెల్లెమ్మలకు చేయాల్సింది ఏదీ కూడా చేయకుండా మహిళా సమాజాన్ని నీరుగార్చాడు. అక్కచెల్లెమ్మలకు ఇస్తానన్న ఏదీ కూడా ఇవ్వలేదు. బడులు తెరిచే సమయానికి అమ్మ ఒడి ఇస్తానన్నాడు. నీకు 15 వేలు, నీకు 15 వేలు అన్నాడు. అధికారంలోకి వచ్చి పంగనామాలు పెట్టాడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని మాటలు చెప్పాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే 18 ఏళ్లు పైబడిన వారికి రూ.18000 వేలు అని అన్నాడు. చివరకు మోసం చేశాడు. పెద్దమ్మలు 50 ఏళ్లు దాటిన వారు కనపడితే నీకు 45 వేలు, నీకు 45 వేలు అని చెప్పి మోసం చేశాడు.
పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద ఏప్రిల్ మాసంలో మేము ప్రతి సంవత్సరం ఇస్తే, ఆ కట్టాల్సిన సొమ్మును కూడా ఎగరగొట్టేసి ఇవ్వకుండా మోసం చేసి రోడ్డున పడేశారు. అక్కచెల్లెమ్మల భద్రత విషయంలో కూడా దిగజారిపోయి, ఈ రాష్ట్రంలో బతకడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారు. చంద్రబాబుకు ఇప్పటికైనా ఒకటే కోరుతున్నా. ఈ జరిగిన ప్రతి ఘటనలో ప్రభుత్వం తరఫు నుంచి మొదట క్షమాపణ చెప్పండి. జరిగిన ప్రతి ఘటన దగ్గరకూ మంత్రులను పంపించి ప్రతి బాధితులకూ రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా డబ్బు ఇవ్వండి. ఇటువంటి తప్పులు ఇంకోసారి జరగనివ్వం అని లెంపలేసుకోండి. ఈ కార్యక్రమం చంద్రబాబు చేయకపోతే చరిత్రహీనుడవుతారు.
ఈ జరిగిన ఆరేడు ఘటనల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రతి బాధిత కుటుంబానికీ రూ.10 లక్షలు ఇస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న మేమే రూ.10 లక్షలు ఇస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు సిగ్గు తెచ్చుకుని ప్రభుత్వంలో ఉన్న మీరు బాధ్యత తీసుకుని మీరేం చేయగలుగుతారో ముందుకు రావాలని కోరుతున్నాం. అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫు నుంచి చేసినా చేయకపోయినా మీరు బాధపడకండి. వచ్చేది మళ్లీ మనమే. మనం వచ్చిన తర్వాత వీళ్లందరినీ ఏరి ఏరి మళ్లీ జైళ్లలో పెట్టించే కార్యక్రమం చేస్తాం. అన్ని రకాల అనుమానాల మధ్య ఈరోజు డాక్టర్లతో మాట్లాడటం జరిగింది.
హైమన్ రప్చర్, టేర్, బ్లీడింగ్, ప్రైవేట్ పార్ట్స్ దెబ్బలు అన్నీ డాక్టర్లు చెప్పినవే. పోలీసుల దర్యాప్తు సిన్సియర్ గా జరగాలి. తప్పు జరిగిందని ఒప్పుకోండి. ఎందుకు వెనకేసుకొస్తున్నారు. మీ వాడు తప్పు చేస్తే ఏదైనా చేయొచ్చు అనే మెసేజ్ ఎందుకు ఇస్తున్నారు? జరిగింది ఒక అన్యాయమైన ఘటన. నష్టం జరిగింది అభాగ్యురాలికి. ఆ కుటుంబంతో తోడుగా ఉండాల్సింది పోయి ఏం చేస్తున్నారు? ఈ కుటుంబానికి న్యాయం జరగకుండా అందరూ వాళ్ల పాత్ర పోషిస్తే ఇంక న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ప్రభుత్వం అన్నది మాట్లాడలేని వాళ్ల తరఫున మాట్లాడటమే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత.
ఇలాంటి ఘటనను నేను రాజకీయం చేస్తున్నానా? ఇక్కడ జరిగిన వాస్తవం చూపిస్తున్నానా? అన్నది మీరందరూ మీ మనస్సాక్షిని అడగాల్సిన అంశం. ఈ తల్లి, చెల్లి నా పక్కనే ఉన్నారు. వీళ్లకు సమాధానం చెప్పండి. వీళ్లకు తోడుగా ఉండేందుకు ప్రభుత్వ పెద్దలు ఎందుకు ముందే రాలేదు. రాజకీయం మీరు చేస్తున్నారు. బాధితుల తరఫున మేం నిలబడితే మా వైపున వేలెత్తి చూపడం ధర్మమేనా?
ఈ ఘటనలో ఈ తల్లి, తనతోపాటు పిల్లలు, భర్త ఆస్పత్రికి చేరుకునే సరికి అక్కడ ముగ్గురు ఉన్నారు. వీళ్లను చూసి జారుకున్నారు. పోలీసులు తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే న్యాయం బయటకు వస్తుంది. ఈ తల్లి అంగన్వాడీ. 14 ఏళ్లుగా టీచర్. దళితులందరూ నా బంధువులు, నా వాళ్లే. నేను ధైర్యంగా చెబుతున్నా. దళితుల కోసం పోరాడతా. తోడుగా ఉంటా.
ఇక్కడ దళితులు, పేదవాడు అన్నది కాదు.. పేదవాడికి ఎవడు తోడుగా ఉన్నాడో ఆలోచన చేయాలని అడుగుతున్నా. జరిగిన ప్రతి ఘటనలో జరగాల్సింది ఏమిటి, చేయాల్సింది ఏమిటి? ప్రభుత్వం తోడుగా ఉండాల్సింది పోయి.. ఇన్సిడెంట్ జరిగితే చేసిన వాడు తెలుగుదేశం వాడైతే సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటువైపున వైయస్సార్ సీపీ వాళ్లని చెప్పడం.. ఏం మాటలివి? ఆ తల్లికి తోడుగా నిలబడితే ఆ తల్లిపై అభాండాలు వేయడమా? ఎక్కడికి పోతున్నాం మనం?’’ అని జగన్ ప్రశ్నించారు.
ఇవీ చదవండి: Jagan on Badvel murder: మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం?
Jagan Press Meet: మారిన జగన్.. ఇకపై రెగ్యులర్ గా ప్రెస్ మీట్లు? సర్కారుపై ఏమన్నారంటే..
Jagan: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు తప్పవు.. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు
Jagan vs CBN: జగన్ ఇంటి ఫెన్సింగ్ వర్సెస్ చంద్రబాబు దుబారా!
