Mrunal Thakur hot: స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ లేటెస్ట గా బాత్ టబ్ లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మామూలుగానే హాట్ గా ఉండే ఈ భామ.. బాత్ డబ్బులో మరింత అట్రాక్షన్ తో కనిపించింది. ఈ మేరకు ఎక్స్ లో వైరల్ వీడియోస్ పేరిట హ్యాష్ ట్యాగ్ తో మృణాల్ హాట్ పిక్స్ (Mrunal Thakur hot) సందడి చేశాయి.

బాత్ డబ్బులో మృణాల్ హాట్ ఫొటోలు అదిరిపోయాయంటూ నెటిజన్లు ఆదుర్దాగా చూడసాగారు. సోషల్ మీడియా జనాలు తెగ హైప్ క్రియేట్ చేశారు. కట్ చేస్తే.. అది రియల్ ఫొటోషూట్ కాదని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో క్రియేట్ చేసిన ఫొటోలని స్పష్టత వచ్చింది. అలా మృణాల్ ఫొటో షూట్ తెగ చక్కర్లు కొట్టింది. మృణాల్ కు సంబంధించిన పిక్స్ రోజూ ఏదో ఒకటి నెట్టింట సందడి చేస్తూనే ఉంది.

సదరు ఫొటోలు ఎంత సహజంగా ఉన్నాయంటే.. అవి ఫేక్ అంటే నమ్మడంశక్యంగా లేదని, ఏఐ ఫొటోస్ అన్నా కూడా నమ్మడం లేదంటున్నారు నెటిజన్లు. జనాలు మళ్లీ మృణాల్ ఇన్స్టాగ్రామ్ కి వెళ్లి ఆమె ప్రొఫైల్ లో చెక్ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత గానీ అవి ఏఐ ఫొటోలు అని క్లారిటీకి రావడం లేదు.

ఈ ఏఐ అనేది కేవలం మృణాల్ ఠాకూర్ కి మాత్రమే పరిమితం కాలేదు. చాలామంది సినీ హీరోయిన్లు, బడా స్టార్లు దీని బారిన పడ్డారు. అయితే, మృణాల్ ఫొటోలు వైరల్ అయినట్లుగా మిగతావాళ్ల పిక్స్ వెళ్లడం లేదు. అందుకు కారణం మృణాల్ ఫొటోల్లో అత్యంత సహజత్వం ఉట్టిపడటమే. ఈ విషయంలో మృణాల్ & టీమ్ తెగ టెన్షన్ పడుతున్నారట. ప్రతిసారీ ఆ ఫోటోలు ఒరిజినల్ కావు అని క్లారిటీ ఇవ్వలేక తలలు పట్టుకోవాల్సి వస్తోంది.

మొన్ననే ఆ బాత్ టబ్ ఫోటోలు ఫేక్ అని క్లారిటీ ఇచ్చాక, ఇప్పుడు బీచ్ ఫోటోలు దర్శనం ఇచ్చాయి. అవి కూడా ఫేక్ అంటూ స్పష్టత ఇవ్వాలా వద్దా అన్న సందిగ్దం ఏర్పడింది. ఇలా అన్నింటికీ క్లారిటీ ఇచ్చుకుంటూ పోతే కష్టం అనే భావన వ్యక్తమవుతోంది.

ఈ సంగతి అలా ఉంచితే మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించట్లేదు. హిందీలో మాత్రం వరుసబెట్టి మూవీస్ చేసేస్తోంది అందాల భామ. అప్పట్లో చిరంజీవి సరసన హీరోయిన్ గా అవకాశం లభించిందని ప్రచారం జరిగింది కానీ, కార్యరూపం దాల్చలేదు.

మృణాల్ మళ్లీ తెలుగులో ఎప్పడు కనిపిస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. సీతగా పద్ధతిగా కనిపించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత హాట్ పోజులు, పొట్టి డ్రెస్సులతో మైమరపించేయడంతో.. మళ్లీ తెలుగులో కనిపించాలని కోరుకుంటున్నారు. నాని సరసన ఓ మూవీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తమిళంలో సూర్య సరసన ముగ్గురు హీరోయిన్లలో ఒకరు మృణాల్ అన్న వార్తలు కూడా వస్తున్నాయి.
ఇవీ చదవండి: Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ఫొటో గ్యాలరీ
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ జోరు.. రెమ్యునరేషన్ పెంచేసిందిగా.. వయ్యారి భామ ఫొటో గ్యాలరీ
Mahima Nambiar: మహిమ నంబియార్ క్యూట్ పోజులు.. ఎవరీ చిన్నది?
Rakul Preet singh: రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రగ్యా బర్త్ డే విశెష్.. అందాల భామల హాట్ పోజులు
Mouni Roy: దసరా నవరాత్రి సెలబ్రేషన్స్‌లో మౌని రాయ్.. ఫొటో గ్యాలరీ
