CBN on YSRCP: గత ప్రభుత్వంలో వైయస్ జగన్ నిర్ణయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్అయ్యారు. గంజాయి, లిక్కర్, డ్రగ్స్ మత్తులో ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు. వారిని హెచ్చరిస్తున్నా..ఇక రాబోయే రోజుల్లో మీ జీవితాలను నాశనం చేసుకోవాలనుకుంటే తప్పుడు పనులు చేయండి..లేకపోతే మెయిన్ స్ట్రీమ్ కు రండి.. మెయిన్ స్ట్రీమ్ కు రాకపోతే ఎవర్నీ వదిలిపెట్టం అని హెచ్చరించారు.
’’ఎక్కడ చూసిన సీసీ కెమెరాలు పెడుతున్నాం.. టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం..అవసరం అయితే ఇలాంటి వారందర్ని సంఘ ద్రోహులుగా, సమాజం నుంచి సెపరేట్ చేసే విధానాలను ఆలోచిస్తున్నాం.. అవసరం అయితే విదేశాలకు వెళ్లకుండా బ్యాన్ చేయడం, పీఎస్ లలో ఫోటోస్ పెట్టడం..దీనికి అవసరం అయితే ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం.’’ అన్నారు.
’’గంజాయి ఎవడూ పండించడానికి వీల్లేదు, ట్రాన్స్ ఫోర్ట్ చేయడానికి వీల్లేదు. ఎవడూ కన్ జ్యూమ్ చేయడానికి వీల్లేదు. ఎవరైనా చేస్తే అదే లాస్ట్ డే.. రాష్ట్రంలో ఎక్కడైనా డ్రగ్స్ వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. లిక్కర్ కూడా ఇష్టానుసారంగా ఎవరంటే వాళ్లు చేస్తే వదిలిపెట్టం. ఒక ట్రాన్స్ ఫరెంట్ పాలసీ ఇచ్చాం.
మా పార్టీ వాళ్లకు కానీ, అధికారులకు కానీ, మిత్రపక్షాలకు కానీ, ప్రతిపక్ష పార్టీ వాళ్లకు కానీ హెచ్చరిస్తున్నాం. వాళ్లేమీ పతివ్రతలు ఏమీ కాదు. బురదజల్లే కార్యక్రమం చేస్తారు. చేసే బాగోతాలు అన్నీ చేస్తుంటారు. అందరికీ వార్నింగ్ ఇస్తున్నా. చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం. ఈ పాలసీని తూచా తప్పకుండా ట్రూ స్పిరిట్ తో ఇంప్లీమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకే పాత పాలసీ అంతా తీసి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చాం.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
’’రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ పూర్తిగా కంట్రోల్ ఏ క్రైమ్ జరిగినా దాని వెనుక గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, చిన్న గొడవ జరిగితే దానికి వెనుక గంజాయి ఉంటున్నాయి. ఫస్ట్ ఐ ఆస్కింగ్ పేరెంట్స్, ఫ్యామిలీ నెంబర్స్ కంట్రోల్ యువర్ పీపుల్.. చెప్పండి.. ఆ సోషల్ సిగ్మా మీకు ఉంటుంది. వీళ్లందర్ని ప్రజల్లో ఏ విధంగా ఎక్స్ పోజ్ చేయాలో అలా చేస్తాం. ఒక మాటలో చెప్పాలంటే సంఘ బహిష్కరణ చేస్తాం.
జీవితంలో తల ఎత్తుకుని తిరగలేకుండా పరిస్థితి తీసుకొస్తాం.. వీళ్లంతా డ్రగ్స్ తీసుకుని తల్లికి, పెళ్లానికి, కూతురికి వ్యత్యాసం తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. వాళ్లు గంజాయి తగినప్పుడు కూడా మైండ్ లో తిరగాలి ఇదే మనకు ఆఖరి రోజు అవుతుంది అనే భావన రావాలి. అన్ని విధాలుగా సహకరిస్తాం. డీ అడిక్షన్ కోసం డబ్బులు పెడతాం. బీ గుడ్ సిటీజన్స్.. ఐదేళ్లు రాష్ట్రాన్ని ఇలాంటివి చేసి ఎవడూ పట్టించుకోకుండా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రావణాసురకాష్టంగా తయారు చేశారు. ఇంకా అలాంటివి జరగడానికి వీల్లేదు. మెయిన్ స్ట్రీమ్ కు రండి. హ్యాపీగా గడిపే పరిస్థితి తెచ్చుకోండి.’’ అని చంద్రబాబు హితవు పలికారు.
చెత్తపై పన్నా?
చెత్తమీద పన్ను.. చెత్త మీద పన్ను వేశారు కానీ.. 85లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉంది.. రాష్ట్రాన్ని చెత్తచెత్తగా చేసే పరిస్థితి.. చెత్త కుప్పలుగా పేరుకుపోయింది.. సిగ్గు లేకుండా మళ్లీ మాట్లాడుతున్నారు..ఆ చెత్తల కింద వీళ్లను పూడిస్తే అప్పుడు బుద్ది వస్తుంది.. అంత దుర్మార్గం చేశారు.. మచిలీపట్నంలో నాలుగురోడ్ల జంక్షన్ లో ఒక అడవి మాదిరి చెత్త ఉంది..
బుద్ది, నం ఉందా మీకు..మీకు రాజకీయా నాయకుడిగా ఉండటానికి అర్హత ఉందా..రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా..చెత్తలో వర్షం పడితే అవి అంత భూగర్బజలాలగా మారి కలుషితం అయితే ఆరోగ్యానికి ప్రమాదం కాదా ఇది..ఆ రోజు స్వచ్ఛ భారత్ కింద వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టి చెత్తను కూడా ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే.. ఈరోజు అవన్నీ కూడా మూసేసి.. వేస్ట్ కంపోస్ట్ షెడ్లు కడితే వాటికి కూడా రంగులు వేసుకుని అవి కూడా ముసేసి..సర్వనాశనం చేసి గ్రామలు గ్రామాలను చెత్తకుప్పలుగా తయారుచేశారు.. అందుకే ఈ రోజు చెత్త మీద పన్ను తీసేశాం..వీళ్లు చేసినటువంటి చెత్తను క్లీన్ చేయడానికి సంవత్సరం పడుతుంది..దానికి దగ్గరదగ్గర వీళ్లు చేసిన చెత్తను తీయడానికి రూ.2వేల కోట్లు అవుతుంది.’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
ఇవీ చదవండి: AP Cabinet: ఏపీ కేబినెట్ నిర్ణయాలు.. పలు పాలసీలకు ఆమోదం
Sajjala: కక్ష సాధింపు చర్యలు.. వేధింపులు.. రెడ్ బుక్ పాలన
Gadikota Srikanth Reddy: రాష్ట్రంలో దౌర్జన్యాల సంస్కృతికి శ్రీకారం
AP News: ఆ కేసులో నిందితులకు ఆస్తులు ఎలా వచ్చాయి?
