HomeAndhra PradeshAP DSC 2024: ఏపీ డీఎస్సీకి సర్వం సిద్ధం.. డిసెంబర్ 31లోగా పూర్తి?!

AP DSC 2024: ఏపీ డీఎస్సీకి సర్వం సిద్ధం.. డిసెంబర్ 31లోగా పూర్తి?!

AP DSC 2024: ఏపీలో మెగా డీఎస్సీ ప్రక్రియతో 16,347 పోస్టులు భర్తీ చేసేందుకు కొత్త ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో యాస్పిరెంట్స్ అందరూ పట్టుదలగా ప్రిపేర్ అవుతున్నారు. గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ను కూటమి ప్రభుత్వం రద్దు చేసి మెగా డీఎస్సీని (AP DSC 2024) ప్రకటించింది. డిసెంబర్ 31 లోగా నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే, నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు టెట్ వాయిదా వేసింది. ప్రస్తుతం టెట్ (TET) పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి ఈనెల 16వ తేదీతో ముగుస్తున్నాయి. వీటి ఫలితాలు నవంబర్ 2న ప్రకటిస్తారు. అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ (AP DSC 2024) నవంబర్ మొదటి వారంలోనే వెలువరించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని భావించినా మరింత మంది అభ్యర్థులకు టెట్‌ లో అర్హత సాధించే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మొదట టెట్ పెట్టారు. టెట్ కు, డీఎస్సీకి కనీసం 3 నెలలు గ్యాప్ ఉండాలని అభ్యర్థుల నుంచి వచ్చిన వినతి మేరకు వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇప్పటికే ఆశావహులు గత ప్రభుత్వం దిగిపోయే మూడు నెలల ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నారు. మరో ఆరు నెలలంటే చాలా సమయం అవుతుందని, త్వరగా పరీక్షలు నిర్వహించాలనే వాదన కూడా ఉంది. ఆర్నెల్లకు మించి ఆలస్యమైతే అభ్యర్థులకు భారంగా మారుతోందని కొందరు చెబుతున్నారు. దీంతో నవంబర్‌లోనే డీఎస్సీ పరీక్షల నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.

సిలబస్‌లో మార్పు లేదని క్లారిటీ
డీఎస్సీ 2024 సిలబస్ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే తోసిపుచ్చింది. సిలబస్ వివరాలను https://aptet.apcfss.in అందుబాటులో ఉంచామని అధికారులు క్లారిటీ ఇచ్చారు.

అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో పోస్టులకు సంబంధించి న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచనలు చేశారు.

పోస్టుల డీటెయిల్స్ ఇవీ..
మెగా డీఎస్సీలో మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

డిసెంబర్ 31లోగా పూర్తి చేస్తారా?
రాష్ట్ర విద్యాశాఖ కొత్తగా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నవంబర్ 3న ఇచ్చే అకాశం ఉంది. గత డీఎస్సీ ప్రకటనను అనుసరించి దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన పనిలేదు. కొత్తగా ఏ జిల్లాలకైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అవకాశం ఇస్తారు. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం ప్రక్రియను 6 నెలల్లోపే పూర్తి చేస్తామని అప్పట్లో ప్రకటించింది.

Read also: Telangana DSC Results: తెలంగాణ డీఎస్సీ ఫలితాల విడుదల
AP DSC New Schedule: ఏపీ డీఎస్సీ 2024 షెడ్యూల్‌లో మార్పులు.. మార్చి 20వ తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్లు
AP DSC 2024: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు.. పూర్తి వివరాలు ఇవీ..
AP DSC Notification: ఏపీలో టీచర్‌ ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. డీఎస్సీ నోటిఫికేషన్‌ రిలీజ్‌.. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు