HomeCrime NewsIllegal lending: రుణ యాప్‌పై ఈడీ కొరడా.. భారీ జరిమానా.. ఎందుకంటే!

Illegal lending: రుణ యాప్‌పై ఈడీ కొరడా.. భారీ జరిమానా.. ఎందుకంటే!

Illegal lending: రుణ యాప్ ల పేరుతో వేధింపులు ఇటీవలి కాలంలో అధికం అయ్యాయి. ఈ క్రమంలో అక్రమ వడ్డీలు (Illegal lending) వసూలు చేస్తూ ఈఎంఐలు కట్టినప్పటికీ కొందరికి వేధింపులు తప్పడం లేదు. దీంతో బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ రుణ యాప్ సంస్థపై ఈడీ కొరడా ఝులిపించింది.

రుణయాప్‌ సంస్థ పీసీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పీసీఎఫ్‌ఎస్‌)పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అడ్జుకేటింగ్‌ అథారిటీ రూ.2146,48,26,480 ఫైన్ వేసింది. (Illegal lending)

ఇటీవలి కాలంలో ఓ రుణయాప్‌ సంస్థపై ఈ స్థాయిలో జరిమానా వేయడం ఇదే తొలిసారి. పీసీఎఫ్‌ఎస్‌ సంస్థ ఫారిన్‌ ఎక్స్ఛేంజి మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నార్వే కేంద్రంగా పని చేస్తున్న ఒపేరా గ్రూప్‌నకు అనుబంధంగా పీసీఎఫ్‌ఎస్‌ సంస్థ ఉంది. దీని అంతిమ లబ్ధిదారులు చైనా దేశస్తులని తేలింది. ఈ విషయం గతంలోనే వెల్లడైంది.

అధిక వడ్డీలు వసూలు

ఈ సంస్థ క్యాష్‌బీన్‌ అనే యాప్‌ ద్వారా లోన్లను ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తూ అక్రమంగా బిజినెస్ రన్ చేసింది. రుణగ్రహీతలపై భారీగా వడ్డీలు విధించి పెద్దఎత్తున లాభాలు దండుకున్న పీసీఎఫ్‌ఎస్‌.. సాఫ్ట్‌వేర్‌ లైసెన్స్‌లను దిగుమతి చేసుకున్నామనే సాకు చూపి రూ.429.3 కోట్లను విదేశాల్లోని సంస్థలకు మళ్లించింది. ఈడీ దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఇదంతా ఫాల్స్ అని తేలింది. ఈ నేపథ్యంలో 2021లోనే ఈ కంపెనీకి చెందిన సంస్థకు చెందిన రూ.252.36 కోట్ల చర, స్థిరాస్తుల్ని టెంపరరీగా జప్తు చేసింది.

ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీబీఐ)ల పేరిట నకిలీ ఎంబ్లమ్స్ తో తయారు చేసిన పత్రాల ఆధారంగా రుణాలు తీసుకున్న వారి నుంచి పీసీఎఫ్‌ఎస్‌ భారీ ఎత్తున ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసినట్లు ఆర్‌బీఐ 2022 ఫిబ్రవరిలో ఐడెంటిఫై చేసింది. ఈ కారణంగా పీసీఎఫ్‌ఎస్‌కు ఉన్న నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ రిజిస్ట్రేషన్‌ను క్యాన్సిల్ చేశారు.

జూన్ 22న షోకాజ్ నోటీసు

ఆస్తుల జప్తు తర్వాత నిందితులకు వివరణ ఇచ్చే చాన్స్ కల్పిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అడ్జుకేటింగ్‌ అథారిటీ 2022 జూన్‌ 22న షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. దీనిపై పీసీఎఫ్‌ఎస్‌ అప్పటి కంట్రీ హెడ్‌ జాంగ్‌హంగ్‌ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. ఈ నేపథ్యంలో పీసీఎఫ్‌ఎస్‌ లిఖిత పూర్వక వివరణను పరిశీలించిన తర్వాత ఆ కంపెనీ ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ అడ్జుకేటింగ్‌ అథారిటీ నిర్ధారణ చేసింది. పీసీఎఫ్‌ఎస్‌కు చెందిన రూ.252.36 కోట్ల ఆస్తుల జప్తు చేసినట్లు ఈ నెల 7వ తేదీన వెల్లడించింది. దీనికితోడు భారీ స్థాయిలో ఫైన్ కూడా వేసింది.

Read also:Jamili Elections: 2026లోనే కొత్త నియోజకవర్గాలు.. 2027లో జమిలి?
Crime News: రూ.10 వేలు ఆశ చూపించి.. రూ.2.29 కోట్లు కొల్లగొట్టేశారు!
Sayaji Shinde: షాయాజీ షిండే పొలిటికల్ ఎంట్రీ.. పోటీ లేదా?
Constable Jobs: ఏపీలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ.. 5 నెలల్లో పూర్తికి కసరత్తు
Bhuma Akhila Priya: భూమా అఖిల ప్రియపై కలెక్టర్ కు గంగుల నాని ఫిర్యాదు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు