Rafael Nadal: స్పెయిన్‌కు చెందిన రాఫెల్ నాదల్ గురువారం తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించాడు. నవంబర్‌లో మలాగాలో జరిగిన డేవిస్ కప్ ఫైనల్ తర్వాత ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని వెల్లడించాడు. అతని కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు, ఒలింపిక్ సింగిల్స్ స్వర్ణం సాధించాడు.
తన రిటైర్‌మెంట్‌ను ప్రకటిస్తూ, నాదల్ 13 భాషల్లో “అందరికీ చాలా ధన్యవాదాలు” అని రాశాడు.
“ఇది కొన్ని కష్టంగా గడిచిన ఏళ్లకు, ముఖ్యంగా ఈ గత రెండు సంవత్సరాలకు ముగింపు” అని రికార్డు స్థాయిలో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్న 38 ఏళ్ల రఫెల్ నాదల్ ఒక వీడియోలో చెప్పాడు.
“నేను ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు మీకు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఇది కొన్ని కష్టతరమైన సంవత్సరాలకు, ముఖ్యంగా గత రెండు సంవత్సరాలకు ముగింపు. పరిమితులు లేకుండా ఆడగలిగానని నేను అనుకోను.” అని వీడియోలో వెల్లడించాడు.
స్పెయిన్ దేశానికి చెందిన నాదల్ తన నిర్ణయం నిరంతర గాయాల సమస్యలకు సంబంధించినదని పేర్కొన్నాడు. గాయాల నేపథ్యంలో రెండేళ్లుగా అనేక టోర్నీలను మిస్ అయ్యానని గుర్తు చేసుకున్నాడు. నాదల్ రిటైర్మెంట్ ప్రకటన తర్వాత.. వింబుల్డన్ ఎక్స్ లో ట్వీట్ చేసింది. “ఎప్పటికీ ఒక ఛాంపియన్” అని పేర్కొంది.
మే మొదటి వారంలో టెన్నిస్ లెజెండ్ రాఫెల్ నాదల్ మాడ్రిడ్ ఓపెన్‌లో అభిమానులకు భావోద్వేగ వీడ్కోలు పలికాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఐదుసార్లు కప్ ను ముద్దాడాడు. నాదల్ 2008, 2017 మధ్య పదేళ్ల పాటు గెలిచిన టైటిల్‌లను గుర్తుచేసే ఐదు బ్యానర్‌లను, జిరి లెహెక్కాతో నాలుగో రౌండ్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత టోర్నమెంట్ డైరెక్టర్ ఫెలికానో లోపెజ్ నుంచి ప్రత్యేక ట్రోఫీని అతనికి అందించారు.
తన వీడ్కోలు గురించి చెబుతూ, భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ, నాదల్ కొన్ని వారాల క్రితం తాను మళ్లీ అధికారిక మ్యాచ్‌లో పాల్గొంటానో లేదో తెలియదని వ్యాఖ్యానించాడు.
“ఇది నాకు చాలా ప్రత్యేకమైన వారం, వ్యక్తిగతంగా మరియు నా టెన్నిస్‌కు అనేక విధాలుగా చాలా సానుకూలంగా ఉంది. నాకు మళ్లీ కోర్టులో ఆడే అవకాశం వచ్చింది. కొన్ని వారాల క్రితం, బార్సిలోనాకు రెండు రోజుల ముందు వరకు నేను మళ్లీ అధికారిక మ్యాచ్‌లో పాల్గొంటానని అనుకోలేదు. ఇప్పుడు రెండు వారాల పాటు ఆడాను” అని నాదల్ పేర్కొన్నాడు.
https://tiwtter.com/Wimbledon/status/1844317019719729660
“నేను చెప్పగలిగేది ఒక్కటే ‘ధన్యవాదాలు’. ఇది నా చిన్నతనంలో ప్రారంభమైన ఒక అద్భుతమైన ప్రయాణం. 2003లో టోర్నమెంట్‌ను ఇండోర్‌లో ఆడినప్పుడు నేను మొదటిసారి మాడ్రిడ్‌కి వచ్చాను. నేను ఇక్కడకు మొదటిసారి వచ్చిన అనుభూతిని పొందాను. 2005లో పోటీ జరిగింది. ఇది నా కెరీర్‌లో అత్యంత ఉత్తేజకరమైన విజయాలలో ఒకటి. ఇప్పటికీ కోర్టు లోపలే అందరి నుంచి మద్దతు లభిస్తోంది.” అని నాదల్ అన్నాడు.
ఇవీ చదవండి: Nitish Kumar Reddy: బంగ్లాపై తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సత్తా.. సిరీస్ కైవసం
Cricket: టీమిండియా కెప్టెన్ గా సచిన్ టెండూల్కర్.. నవంబర్ 17 నుంచి దిగ్గజాల టోర్నీ!
T10 Cricket: టీ10 క్రికెట్‌లో సంచలనం.. స్కాట్లాండ్ బ్యాటర్ రికార్డు సెంచరీ
Ajit Agarkar: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా మాజీ పేసర్ అజిత్ అగార్కర్.. రాజకీయాలు పక్కనబెట్టి యువ ఆటగాళ్లను గుర్తిస్తారా?
West indies: ప్రపంచ క్రికెట్‌లో ఘోర పరాభవం.. ఘన చరిత్ర నుంచి అట్టడుగుకు కరీబియన్ జట్టు!
