Nitish Kumar Reddy: తెలుగు కుర్రాడు నితీష్ కుమార్‌రెడ్డి విధ్వంసక బ్యాటింగ్ తో చెలరేగాడు. బంగ్లా బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి సిక్స్‌ల మోత మోగించాడు. అంతేనా.. బౌలింగ్ లోనూ సత్తా చాటాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
బంగ్లాదేశ్ పై టీమిండియా టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. సూర్యకుమార్ బృందం బుధవారం రెండో టీ20లో 86 పరుగుల తేడాతో బంగ్లాను ఓడించింది. నితీశ్‌కుమార్ రెడ్డి (74; 34 బంతుల్లో 4×4, 7×6), రింకూ సింగ్ (53; 29 బంతుల్లో 5×4, 3×6) రాణించడంతో భారత్ విజయం సునాయాసమైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 221 పరుగుల భారీ టార్గెట్ ను బంగ్లాదేశ్ ముందు ఉంచింది. హార్దిక్ (32; 19 బంతుల్లో 2×4, 2×6) రాణించాడు. అయితే, భారీ టార్గెట్ ఛేదించడంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు నిలవలేకపోయారు. టీమిండియా బౌలర్ల ధాటికి 9 వికెట్లకు 135 పరుగులకు పరిమితమయ్యారు. వరుణ్ చక్రవర్తి రెండు, నితీష్ కుమార్ రెడ్డి రెండు, అభిషేక్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ విక్టరీతో మూడు మ్యాచ్ ల సీరిస్ లో ఇంకా ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే ఇండియా సీరిస్ ను కైవసం చేసుకుంది. మూడో టీ20 శనివారం హైదరాబాద్‌లో జరగనుంది.
45 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాను నితీష్ కుమార్ రెడ్డి ఆదుకున్నాడు. సునామీ రూపంలో బంగ్లా భరతం పట్టాడు. నితీశ్‌కు తోడు రింకూ సింగ్ కూడా చెలరేగి ఆడాడు. మొత్తంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో పరుగుల వరద పారింది. అవకాశాన్ని పూర్తిగా అందిపుచ్చుకున్న నితీశ్.. బౌలర్లను ఖాతరు చేయకుడా బ్యాట్ కు పని చెప్పాడు. ముచ్చటైన షాట్లతో సిక్సర్లు, ఫోర్లు బాదేశాడు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. రింకూ సింగ్ తో కలిసి నాలుగో వికెట్‌కు 49 బంతుల్లో 108 పరుగుల భాగస్వామ్యం జోడించారు. జట్టు విజయం ఖాయం చేశారు.
ఇవీ చదవండి: Cricket: టీమిండియా కెప్టెన్ గా సచిన్ టెండూల్కర్.. నవంబర్ 17 నుంచి దిగ్గజాల టోర్నీ!
Virat Kohli: కోహ్లీ ప్రపంచ రికార్డు.. టెస్టు చరిత్రలో సంచలనం
Virat Kohli Water: విరాట్ కోహ్లీ తాగే వాటర్ ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Rohit sharma: ఫిట్ నెస్ పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
Rohit Sharma: రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు.. అత్యధిక సార్లు డక్‌ఔట్ అయ్యింది ఎవరంటే..!
