HomeSportsIPL 2025: ఐపీఎల్ వేలం.. ఈ ఆటగాళ్ల గిరాకీ పెరిగిందా?

IPL 2025: ఐపీఎల్ వేలం.. ఈ ఆటగాళ్ల గిరాకీ పెరిగిందా?

IPL 2025: ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకు జాతర. రాబోయే ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఇప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది. 2025 ఏడాదికి (IPL 2025) సంబంధించిన ఐపీఎల్ సీజన్ వేలానికి ముందు ఫ్రాంచైజీలు కొనసాగించే క్రికెటర్ల పేర్లను తెలిపేందుకు ఈ నెల 31 వరకు గడువు ఉంది.

ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియాలోకి నితీశ్‌ కుమార్‌ రెడ్డి, మయాంక్‌ యాదవ్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఈ సిరీస్‌కు ముందు వరకు వీరిద్దరు ‘అన్‌క్యాప్డ్‌’ ప్లేయర్లుగా ఉండేవారు. ప్రస్తుతం టీమిండియాకు ఎంపిక కావడంతో క్యాప్డ్ ప్లేయర్లుగా మారారు. ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం గత ఐపీఎల్‌లో ఆడి వచ్చే ఐపీఎల్‌ వేలానికి ముందు టీమిండియా తరఫున ఆడితే ‘క్యాప్డ్‌ ప్లేయర్‌’గా వేలం నిబంధనలు అతనికి మారుతాయి. 2024 సీజన్‌లో నితీశ్‌ రెడ్డి ఎస్ఆర్హెచ్ తరఫున, మయాంక్‌ యాదవ్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున ఆడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ ఐపీఎల్ వేలంలో గిరాకీ పెరుగుతుందన్న చర్చ జరుగుతోంది.

నితీశ్‌ కుమార్ రెడ్డి గత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు తరఫున ఆడి కీలకంగా మారాడు. 142.92 స్ట్రయిక్‌రేట్‌తో మిడిలార్డర్ లో సరైనోడుగా పేరు తెచ్చుకున్నాడు. గత సీజన్ లో ఏకంగా 21 సిక్సర్లు బాది ఔరా అనిపించాడు. వచ్చే సీజన్ కు సంబంధించి చూస్తూ ‘అన్‌క్యాప్డ్‌’గా అతడిని కనీసం రూ. 4 కోట్లకు హైదరాబాద్‌ తిరిగి కొనసాగించుకునే చాన్స్ ఉందని ఐపీఎల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కానీ ఇప్పుడు క్యాప్డ్‌ ప్లేయర్ కావడంతో తొలి ఐదుగురు ఆటగాళ్లలో ఒకరిగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కమిన్స్, హెడ్, క్లాసెన్, అభిషేక శర్మ లాంటి క్రికెటర్లు కూడా క్యూలో ఉండటంతో నితీశ్‌ కుమార్ రెడ్డిని కనీసం ఐదో ఆటగాడిగా రూ.11 కోట్లకు కొనసాగించే అంశం కూడాపరిశీలనలో ఉందంటున్నారు. ఇక ఎస్ఆర్ హెచ్ కు మరో అవకాశం కూడా ఉంది. నితీష్ ను రిలీజ్ చేసి వేలంలో ‘రైట్‌ టు మ్యాచ్‌’ ద్వారా దక్కించుకోవచ్చు.

ఇక మయాంక్‌ విషయంలో లక్నో సానుకూలంగా ఉండొచ్చన్న విశ్లేషణ ఉంది. గత సీజన్‌లో ఆడింది 4 మ్యాచ్‌లే అయినా అతను తన వేగంతో ఎఫెక్టివ్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. కేవలం 12.14 సగటుతో 7 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు భారత్‌ తరఫున ఆడిన తర్వాత అలాంటి ఆటగాడిని సూపర్ జెయింట్స్ కొనసాగించే వీలుంది. ఒక వేళ వేలంలోకి వెళ్లినా మంచి అమౌంట్ తో ఏదో ఒక ఫ్రాంచైజీ దక్కించుకునే చాన్స్ ఉందంటున్నారు.

కొత్త నిబంధనలు ఏంటి?
వచ్చే సీజన్ ఐపీఎల్ కు సంబంధించి గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను ఫ్రాంచైజీ కొనసాగించుకోవచ్చు. ఇందులో కనీసం ఒకరైనా ‘అన్‌క్యాప్డ్‌’ ప్లేయర్‌ ఉండాలి. కొనసాగించే తొలి ముగ్గురు ప్లేయర్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ.11 కోట్లు చొప్పున ఫ్రాంచైజీలు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత నాలుగో, ఐదో ఆటగాడికి ఇదే లైన్ కొనసాగాలి. అంటే రూ. 18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఐదుగురు ఇంటర్నేషనల్ క్రికెటర్లు అయి ఉంటే ఆరో ఆటగాడు కంపల్సరీ ‘అన్‌ క్యాప్డ్‌’ అవ్వాల్సి ఉంటుంది. అతనికి కనీసం రూ.4 కోట్లు చెల్లించాలి. ఐదుగురుని అట్టి పెట్టుకోకుండా ముగ్గురు చాలు అని భావించే ఫ్రాంచైజీలకు చాన్స్ ఇచ్చేందుకు కూడా రెండు దశలుగా ఈ మొత్తాలను ఖాయం చేశారు.

ఇవీ చదవండి: MS Dhoni Six: మహేంద్రసింగ్‌ ధోని భారీ సిక్సర్లు.. వీడియో వైరల్‌.. సింహం సిద్ధమవుతోంది!!
Virat Kohli: కోహ్లీ ప్రపంచ రికార్డు.. టెస్టు చరిత్రలో సంచలనం
Hardik Pandya: యాట్యిట్యూడ్ స్టార్.. హార్దిక్ స్టైలిష్ ఆటపై భిన్నాభిప్రాయాలు!
Virat Kohli Water: విరాట్ కోహ్లీ తాగే వాటర్ ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Virat Kohli : డోంట్‌ మెస్‌ విత్‌ కింగ్‌ కోహ్లీ.. ఎవరిది వాళ్లకిచ్చేయడం విరాట్‌ స్పెషల్‌!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు