HomeSportsGymnast Dipa: జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ సంచలన నిర్ణయం..

Gymnast Dipa: జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ సంచలన నిర్ణయం..

Gymnast Dipa: ఇండియన్ స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కీలక నిర్ణయం తీసుకుంది. జిమ్నాస్టిక్స్‌కు దీపా రిటైర్మెంట్ ప్రకటన చేసింది. ఈ విష‌యాన్ని దీపా (Gymnast Dipa) సోష‌ల్ మీడియాలో (Social Media) తన ఫ్యాన్స్ తో పంచుకుంది. రిటైర్మెంట్‌ అనంతరం కర్మాకర్‌ కోచ్‌గా లేదా మెంటార్‌ గా తన ప్రస్థానం కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

“జిమ్నాస్టిక్స్ (Gymnastics) నుంచి రిటైర్ కావాలని నిర్ణయం తీసుకున్నాను. బాగా ఆలోచించి ఈ నిర్ణ‌యానికి వచ్చాను. ఇది అంత తేలికైన విషయం ఏమీ కాదు. కానీ నా కెరీర్‌కు వీడ్కోలు చెప్పేందుకు ఇదే స‌రైన స‌మయం అని నేను భావించాను. జిమ్నాస్టిక్స్ నా జీవితంలో ఒక భాగం. నా మజిలీలో ఎన్నో ఎత్తు ప‌ల్లాలను చూశాను.’’ అని దీపా కర్మాకర్ పేర్కొంది.

తనకు ఐదేళ్లు ఉన్న‌ప్పుడు ఫ్లాట్ ఫుట్ కార‌ణంగా జిమ్నాస్ట్ కాలేనని చాలా మంది అన్నారని, కానీ ఇప్పుడు తన విజయాలను చూస్తుంటే తనకే చాలా గర్వంగా ఉందని ఆమె వెల్లడించింది. ప్రపంచ వేదికపై భార‌త్‌కు ప్రాతినిధ్యం వహించడం, పతకాలు సాధించడం తనకు ఎంతో ప్ర‌త్యేకమని చెప్పింది. ముఖ్యంగా రియో ​​ఒలింపిక్స్‌లో ప్రొడునోవా వాల్ట్‌ను ప్రదర్శించడం తన కెరీర్‌లో మరపురాని క్షణాల్లో ఒక‌టిగా మిగిలిపోయిందని త‌న రిటైర్మెంట్ సందర్భంగా పేర్కొన్నది.

2011 నేషనల్‌ గేమ్స్‌లో 4 ఈవెంట్లలో గోల్డ్ పతకాలు సాధించడంతో దీపా కర్మాకర్‌ ఓవర్‌ నైట్‌ స్టార్‌గా అవతరించింది. అనంతరం ఆసియన్‌ గేమ్స్‌లోనూ కూడా బంగారు పతకం గెలుపొంది రికార్డులు తిరగరాసింది. ఆసియన్‌ గేమ్స్‌లో గోల్డ్ పతకం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా దీపా కర్మాకర్ సంచలనం సృష్టించింది. రియో ఒలిపింక్స్‌లో తృటిలో సిల్వర్ మెడల్ ను ఆమె తృటిలో చేజార్చుకుంది. నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిల్లో 77 పతకాలను దీపా కైవసం చేసుకుంది. అయితే, పారిస్‌ ఒలిపింక్స్‌ ఆర్హత సాధించడంలో ఆమె విఫలమైంది. 31 ఏళ్ల దీపా.. తన కెరీర్ లో సాధించిన విజయాలు, మజిలీపై సంతృప్తిగా ఉన్నానని తెలిపింది.

Read also: IPL 2025: ఐపీఎల్ వేలం.. ఈ ఆటగాళ్ల గిరాకీ పెరిగిందా?
Telangana CM: సీఎస్ఎంపీ, మూసీ, సీనరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి సహకరించండి
Rajinikanth: రజనీకాంత్ పై డైరెక్టర్ సంచలన ఆరోపణలు.. కథ మార్చేశారా?
CM Revanth Reddy: రూ.11,713.49 కోట్లు స‌త్వ‌ర‌మే విడుద‌ల చేయాలి
Rachamallu: హామీలు అమలు చేయకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు