HomeTelanganaCM Revanth Reddy: రూ.11,713.49 కోట్లు స‌త్వ‌ర‌మే విడుద‌ల చేయాలి

CM Revanth Reddy: రూ.11,713.49 కోట్లు స‌త్వ‌ర‌మే విడుద‌ల చేయాలి

CM Revanth Reddy: భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతు పనులకు రూ. 11,713.49 కోట్లు స‌త్వ‌ర‌మే విడుద‌ల చేయాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. అమిత్ షాను కలిసి వరద నష్టంపై సమగ్రమైన నివేదికను అందించారు. రాష్ట్రాన్ని తగిన విధంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో వామపక్ష తీవ్రవాద ప్రభావం, పెండింగ్ లో ఉన్న రాష్ట్ర పునర్విభజన సమస్యలు, రాష్ట్రానికి ఐపీఎస్ ల కేటాయింపు వంటి పలు అంశాలపై అమిత్ షాతో చర్చించి సహకరించాలని కోరారు. అమిత్ షా దృష్టికి మరిన్ని అంశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.

* తెలంగాణ‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా 37 మంది ప్రాణాలు, ల‌క్ష‌కు పైగా ప‌శువులు, ఇత‌ర మూగ జీవాలు మృతి చెందాయి. 4.15 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంటతో పాటు రోడ్లు, క‌ల్వ‌ర్టులు, కాజ్‌వేలు, చెరువులు, కుంట‌లు, కాలువ‌లు దెబ్బ‌తిన్నాయి.

* ప్రాథమిక అంచనాల మేరకు రూ. 5,438 కోట్లు మేరకు వరద నష్టం వాటిల్లినట్టు సెప్టెంబ‌రు రెండో తేదీన లేఖ రాశాం. ఆ తర్వాత సెప్టెంబర్ 11 నుంచి 13 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించి 30 వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. భారీ వర్షాలు, వరదల వల్ల మొత్తంగా రూ.11,713 కోట్ల మేర న‌ష్టం వాటిల్లింది.

* వామ‌ప‌క్ష తీవ్ర‌వాద (#LWE) ప్ర‌భావిత జిల్లాల నుంచి తొల‌గించిన ఆదిలాబాద్‌, మంచిర్యాల‌, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల‌ను తిరిగి ఆ జాబితాలో చేర్చాలి.

* తెలంగాణ పోలీస్ శాఖ కొత్త‌గా నియ‌మితులైన పోలీసు సిబ్బందికి గ్రేహౌండ్స్ ద్వారా తీవ్ర‌వాద వ్య‌తిరేక వ్యూహాల్లో (AET) శిక్ష‌ణ ఇప్పిస్తున్నాం. అందుకోసం అవసరమైన అదనపు బడ్జెట్ రూ.25.59 కోట్లు విడుద‌ల చేయాలి.

* పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర పున‌ర్విభ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌హ‌క‌రించాలి. షెడ్యూల్ 9 లోని ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్ 10 లోని సంస్థ‌ల వివాదం సామ‌ర‌స్య‌ పూర్వ‌క‌ ప‌రిష్కారానికి కృషి చేయాలి.

* పునర్విభజన చట్టంలో ఎక్క‌డా పేర్కొనని ఆస్తులు, సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్నందున‌, వాటిలో తెలంగాణ‌కు న్యాయం జ‌రిగేలా చూడాలి.

* రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న స‌మ‌యంలో తెలంగాణ‌కు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారుల‌ను మాత్ర‌మే కేటాయించారు. తెలంగాణకు అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలి.

Read also: Telangana CM: సీఎస్ఎంపీ, మూసీ, సీనరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి సహకరించండి
Telangana: వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎంఆర్ఎఫ్‌కు విరాళాలు
Telangana DSC Results: తెలంగాణ డీఎస్సీ ఫలితాల విడుదల
Bhatti Vikramarka: ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని దీవించారు : భట్టి విక్రమార్క

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు