Tirumala Laddu row: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో (TTD) ప్రసాదంగా అందించే లడ్డూలను (Tirumala Laddu row) తయారు చేసేందుకు కల్తీ నెయ్యిని ఉపయోగించారనే ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు ఉదయం 10.30 గంటలకు విచారణ జరిపింది. న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలను విచారణ చేసింది.
గత విచారణ తేదీ (సెప్టెంబర్ 30) రోజున, తిరుపతి లడ్డూపై విచారణ పూర్తికాకముందే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగా ఆరోపణలు చేశారని కోర్టు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే అంశమని, అందుకే బహిరంగ వ్యాఖ్యలు చేయడంలో ముఖ్యమంత్రి ఆచితూచి వ్యవహరించాలని కోర్టు చెప్పింది.
లడ్డూలను తయారు చేయడానికి జంతువుల కొవ్వును ఉపయోగించినట్లు ఇంకా కచ్చితమైన రుజువు లేదని న్యాయస్థానం అబ్జర్వ్ చేసింది. తిరస్కరించిన నెయ్యి నమూనాలలో మలినాలను గుర్తించినట్లు ల్యాబ్ నివేదిక ప్రాథమికంగా సూచించిన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) స్వతంత్రతపై బెంచ్ సందేహాలు వ్యక్తం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరిపే అంశంపై భారత సొలిసిటర్ జనరల్ అభిప్రాయాలను గత విచారణ సందర్భంగా కోరింది. సొలిసిటర్ జనరల్ నేటి వరకు గడువు కోరడంతో ఇవాళ ఉదయానికి వాయిదా పడింది. దీనిపై డా.సుబ్రమణ్యస్వామి, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సురేష్ చవాన్కే, డాక్టర్ విక్రమ్ సంపత్ పిటిషన్లు దాఖలు చేశారు.
ఇవాళ ఉదయం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కొత్త సిట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, రాష్ట్ర సర్కార్ నుంచి ఇద్దరు పోలీస్ అధికారులు, సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారితో స్వతంత్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది.
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో విచారణ జరపాలని సూచించింది. కొత్త సిట్ బృందం విచారణ అనంతరం కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. స్వతంత్ర దర్యాప్తు సంస్థపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై రాజకీయ డ్రామాలు వద్దు అని స్పష్టం చేసింది. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే.. రాజకీయ జోక్యం ఉండదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఇవీ చదవండి: Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు : సుప్రీం కోర్టు తీర్పు
Bhumana: సుప్రీంకోర్టును సైతం హెచ్చరించేలా పనవ్ విమర్శలు: భూమన
Tirumala Laddu: నేడు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ
Purandeswari: చంద్రబాబుపై సుప్రీంకోర్టు కామెంట్లు సమంజసం కాదు: పురందేశ్వరి
YSRCP: వైయస్సార్ సీపీ నేతలకు సుప్రీం కోర్టులో ఊరట
