HomeCinemaDevara: రిలీజ్‌కు ముందే రికార్డులు.. ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది

Devara: రిలీజ్‌కు ముందే రికార్డులు.. ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది

Devara: ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రం రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డులలు బద్దలు కొడుతోంది. ఈ చిత్రం ఈనెల 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే దేవ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో నిర్వాహకులు ఫెయిల్ కావడం కాస్త నిరాశ పరిచింది. అంచనాలకు మించి జనం వచ్చేయడంతో ఇలా జరిగిందని చెబుతున్నారు.

రిలీజ్ కాక ముందే తాజాగా ఈ మూవీ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఓవర్సీస్‌లో దీని ప్రీసేల్‌ టికెట్‌ బుకింగ్స్‌లో హవా కంటిన్యూ చేస్తోంది. ఓవర్సీస్‌లో ప్రీసేల్‌ బుకింగ్స్‌లో అత్యంత వేగంగా వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరుకొని రికార్డును నెలకొల్పింది. అలాగే రెండు మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది. రిలీజ్‌కు మరో మూడు రోజులు ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అభిమానులంటున్నారు.

ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం
జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీలో ట్రిపుల్ యాక్షన్ చేస్తున్నారంటూ ఊహాగానాలు సోషల్ మీడియాలో జోరుగా వస్తున్న క్రమంలో ఎన్టీఆర్ దీనిపై సినిమాటోగ్రాఫర్‌ స్పందించారు. ‘‘ఈ సినిమాపై చాలా ఊహాగానాలు స్ప్రెడ్ అవుతున్నాయి. రోజురోజుకూ అవి బాగా పెరుగుతున్నాయి. యూట్యూబ్‌ చానళ్ల గురించి సరేసరి. వాళ్లు ఎలా పడితే అలా చెప్పగలరు. కానీ ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం మాత్రమే చేస్తున్నారు. ఆయన తండ్రీకొడుకుల్లాగా లేదా బ్రదర్స్ లాగా నటిస్తున్నారా అనేది సినిమాలో చూస్తే మీకే తెలుస్తుంది.’’ అని చెప్పారు.

మరోవైపు అటు ఏపీలో, ఇటు తెలంగాణలో దేవర చిత్రం స్పెషల్ షోలకు ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చారు. దీంతో చిత్ర యూనిట్ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపింది.

ఇవీ చదవండి: Devara Trailer: దేవర ట్రైలర్ రిలీజ్.. కథతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ చింపేశాడ్రోయ్!
Devara Trailer: దేవర ట్రైలర్.. సోషల్ మీడియా షేక్ అవ్వాలి.. చూసేందుకు రెడీనా?
Jr NTR: తమిళ ఎంట్రీపై జూనియర్ ఎన్టీఆర్ హాట్ కామెంట్స్
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ ఫొటో గ్యాలరీ..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు