HomeAndhra PradeshBalineni: బాలినేని జనసేనలోకి ఎంట్రీ వెనుక పొలిటికల్ స్ట్రాటజీ?

Balineni: బాలినేని జనసేనలోకి ఎంట్రీ వెనుక పొలిటికల్ స్ట్రాటజీ?

Balineni: వైయస్సార్ సీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయడం పొలిటికల్ గేమ్ లో ఒక భాగంగా చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ కల్చర్ లో రాజకీయాలు చేసిన నాయకులు అందరూ బాలినేని స్టైల్ లోనే ఉంటారని, పార్టీపై, నాయకత్వంపై విమర్శలు చేస్తుంటారన్నది తెలిసిందే. ఈ తరహా నేతలు పార్టీ మారడం అనేది దాదాపు జరగని పని. కానీ పార్టీ మారితే మాత్రం వేరొక పార్టీలో మనుగడ సాగించడం అంత తేలికైన పని కాదు.

2019 ఎన్నికల్లో ఏపీలో వైయస్ జగన్ గెలిచిన తర్వాత టీడీపీలో నుంచి సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేష్ లాంటి వారు బీజేపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఏపీలో ఇలాంటి వారి సంఖ్య పెరిగే చాన్స్ లేకపోలేదు. పార్టీ అధికారంలో లేని సమయంలో.. తమ వ్యాపారాలు, అనుచరులపై కేసులు పెట్టకుండా తదితర జాగ్రత్తల కోసం చాలా మంది అధికార పార్టీవైపు చూస్తుంటారు. ఇది అత్యంత సహజంగా జరిగే ప్రక్రియే. రాజకీయాల్లో సర్వసాధారణం.

ఇప్పుడు ఏపీలో అధికారం కోల్పోయిన వైయస్సార్ సీపీ నుంచి పలువురు నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అలాగే పలువురు ఎమ్మెల్సీలు టీడీపీతో టచ్ లోకి వెళ్లారు. కార్పొరేషన్లు, మున్సిపల్ పరిధిలో చాలా మంది టీడీపీలో చేరిపోయారు. మాజీలు చాలా మంది టీడీపీ లేదా, బీజేపీ లేదా జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.

అయితే, ఎన్నికల సమయానికి వీరంతా మళ్లీ టిక్కెట్టు కోసమో, మనుగడ కోసమో పార్టీ మారే చాన్స్ లేకపోలేదు. అధికార పార్టీలో, ప్రభుత్వంలో ఏం జరుగుతోందన్నది తెలుసుకునేందుకు అధినాయకత్వం స్వయంగా పార్టీ మారేలా ప్రోత్సహిస్తారనే విశ్లేషణలు వస్తున్నాయి. మరి బాలినేని చేరిక అందులో భాగమేనా? అన్నది కాలమే సమాధానం చెప్పాలి.

ఇవీ చదవండి: CM Chandrababu: క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ను ప్రమోట్ చేయాలి: చంద్రబాబు
Pothina Mahesh: దుర్గమ్మ ఆలయ ఆదాయం టీడీపీ నేత జేబుల్లోకి.. మూడు నెలల్లో రూ.4 కోట్ల అవినీతి!
Seediri Appalaraju: మెడికల్‌ సీట్లు వదులుకోవడం దారుణం: సీదిరి అప్పలరాజు
Lifestyle: మనిషి రోజుకు ఎన్ని గంటలు నిల్చుకోవాలి? కూర్చోవాలి?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు