CM Chandrababu: క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ను ప్రమోట్ చేయాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ లో చంద్రబాబు పర్యటించారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై భేటీలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయన్న చంద్రబాబు.. ఆర్థిక సంస్కరణలకు ముందు వృద్ధిరేటు సాధారణంగా ఉండేదన్నారు. ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారత్ వాసి ఉంటున్నారని తెలిపారు. ప్రతి నలుగురు భారత ఐటీ నిపుణుల్లో ఒక తెలుగురాష్ట్రాల వాసి ఉన్నారన్నారు.
’ఐటీ ప్రవేశపెట్టినప్పుడు విప్లవాత్మక మార్పలు వచ్చాయి. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ మొదలైంది. గతంలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉండేవి. విద్యుత్ రంగంలో గణనీయమైన సంస్కరణలు వచ్చాయి. 2014లో రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ప్రవేశపెట్టాం. క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ను ప్రమోట్ చేయాల్సి ఉంది.
విద్యుత్ బిల్లులు కట్టడికి ఆర్ఈతో పాటు కటింగ్ ఎడ్జ్ సాంకేతికత వాడాలి. గ్రిడ్ నిర్వహణకు సమతూకానికి విద్యుత్ రవాణా వ్యవస్థ మెరుగుపర్చాలి. గ్రీన్ ఎనర్జీ కారిడార్లను సరిగా నిర్వహించాల్సి ఉంది. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ల ద్వారా నేరుగా ట్రాన్స్ మిషన్ చేయాలి. మాన్యుఫాక్చరింగ్ ఎకో సిస్టమ్ ను ప్రమోట్ చేయాల్సి ఉంది. క్లీన్ ఎనర్జీ ప్లాంటుల ఏర్పాటుకు పెట్టుబడిదారులను ఆకర్షించాలి.
క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ద్వారా ఉపాధి కల్పన జరుగుతుంది. క్లీన్ ఎనర్జీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్దఎత్తున ఉపాధి కల్పన జరుగుతుంది. రాష్ట్రంలో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నాం. ఉత్తమ విధానాల ద్వారా ఏపీకి పలు ప్రాజెక్టులు సాధించాం. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్, నైపుణ్యాభివృద్ది కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంది. గ్రీన్ ఎనర్జీ సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సి ఉంది. నెడ్ క్యాప్ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.
ఏపీలో విన్-విన్ విధానంలో భూసమీకరణ జరుగుతుంది. భూసమీకరణ సమయంలో మానవతా కోణంలో ఆలోచిస్తాం. భూసమీకరణకు ఒప్పించి సానుకూల వాతావరణం ఉండేలా చూస్తాం. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో ముందుకెళ్తాం’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Read also: Pothina Mahesh: దుర్గమ్మ ఆలయ ఆదాయం టీడీపీ నేత జేబుల్లోకి.. మూడు నెలల్లో రూ.4 కోట్ల అవినీతి!
Seediri Appalaraju: మెడికల్ సీట్లు వదులుకోవడం దారుణం: సీదిరి అప్పలరాజు
Lifestyle: మనిషి రోజుకు ఎన్ని గంటలు నిల్చుకోవాలి? కూర్చోవాలి?
Koneti Adimulam: కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో ట్విస్ట్
