Jr NTR: టాలీవుడ్ లో దూసుకెళ్తూ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో చిత్రాల్లో రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. తాజాగా దేవర చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అటు హీరోయిన్ జాన్వీ కపూర్ (Jahnvi Kapoor) ఇటు హీరో ఎన్టీఆర్ (Jr NTR), చిత్ర బృందం దేశ వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది.

చాలా మంది పెద్ద దర్శకులు ఎన్టీఆర్‌తో కలిసి సినిమా తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఓ తమిళ దర్శకుడి సినిమాలో నటించాలని అనకుంటున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు. ‘దేవర’ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న యంగ్ టైగర్ రీసెంట్ గా చెన్నై వెళ్లాడు. ఓ ఇంటర్యవూలో మాట్లాడుతూ ‘తమిళ సినిమా ఎప్పుడు చేస్తారు?’ అన్న ప్రశ్నకు వైవిధ్యంగా సమాధానం ఇచ్చాడు. తాను వెట్రిమారన్‌కి వీరాభిమాని అని, దయచేసి తనతో ఓ తమిళ సినిమా చేయాలంటూ ఆయన్ను రిక్వెస్ట్ చేస్తున్నానన్నారు.
వెట్రిమారన్ కూడా ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నట్లు గతంలో చెప్పాడు. ‘అసురన్’ సినిమా పూర్తయిన తర్వాత జూ ఎన్టీఆర్‌తో కొత్త మూవీ కోసం చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కానీ ఇద్దరికీ డేట్స్ కుదరక ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.
వెట్రిమారన్ మూవీస్ విషయానికి వస్తే… పొల్లాధవన్, ఆడుకులం, విసారణై, వడ చెన్నై, అసురన్, విడుదలై లాంటి చిత్రాలతో మాంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.
Read also: Puja Khedkar Controversy: పూజా ఖేడ్కర్ కాంట్రవర్సీ ఏంటి? సివిల్ సర్వెంట్లను నియంత్రించే నియమాలు ఎలా ఉంటాయంటే..
NTR Bharosa Pension: ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కు ఎలా అప్లయ్ చేయాలి?
Controlling anger: కోపాన్ని నియంత్రించడం ఎలా?
Devara Trailer: దేవర ట్రైలర్ రిలీజ్.. కథతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ చింపేశాడ్రోయ్!






