HomeAndhra PradeshKoneti Adimulam: కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో ట్విస్ట్

Koneti Adimulam: కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో ట్విస్ట్

Koneti Adimulam: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక వేధింపుల బాధితురాలు వరలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో కేసు దర్యాప్తునకు అవసరమైన ఆరు రకాల పరీక్షల నిమిత్తం శాంపిల్స్‌ సేకరణ పూర్తయిన తర్వాత నిన్న వరలక్ష్మీ డిశ్చార్జ్ అయింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తాళం వేసుకొని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

వరలక్ష్మి జాడ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆదిమూలం-వరలక్ష్మీ మధ్య రాజీ కుదుర్చేందుకు టీడీపీ నాయకులు రహస్యమంతనాలు జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. రహస్య మంతనాల నేపథ్యంలోనే వరలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లిందని చెబుతున్నారు. పుత్తూరులో తన నివాసంలోని ఎమ్మెల్యే ఆదిమూలం, గన్ మెన్లు, పీఏకు మాత్రమే ఇంట్లోకి ఎంట్రీ ఉందని చెబుతున్నారు. ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ పై విచారణ నేపథ్యంలో తాజాగా ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఇవీ చదవండి: YSRCP: వైయస్సార్ సీపీ నేతలకు సుప్రీం కోర్టులో ఊరట
YS Jagan: తప్పుడు సంప్రదాయాలు ఆపకుంటే మీకూ ఇదే గతి: వైయస్ జగన్ హెచ్చరిక
Ambati Rambabu: వైఫల్యాలు కప్పి పుచ్చడానికే బోట్ల పేరుతో చంద్రబాబు డ్రామా
Chandrababu Naidu: వైయస్ జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు
Telangana: వరద బాధితుల కోసం సినీ నటి రూ.50 లక్షల విరాళం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు