YSRCP: టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన కేసులో వైయస్సార్ సీపీ నేతలకు ఊరట లభించింది. పలువురు నేతలకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. వైయస్సార్ సీపీ నేతలు దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్ల అప్పి రెడ్డి, రఘురాం, గవాస్కర్ లకు ముందస్తు బెయిలు మంజూరు అయ్యింది.
జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ఏహసనుద్దిన్ అమానుల్లా ఈ కేసును విచారణ జరిపారు. వీరంతా దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించారు. వీరి పాస్పోర్టులు సరెండర్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 4 కు వాయిదా వేసింది.
వైయస్సార్ సీపీ తరఫున కపిల్ సిబల్, నీరజ్ కిషన్ కౌశల్, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. 2021లో టీడీపీ కార్యాలయం పై దాడి జరిగిన సమయంలో అక్కడ వైయస్సార్ సీపీ కీలక నాయకులు ఎవరూ లేరని వాదించారు. ఒకరికి చిన్న గాయం జరిగిందని గత దర్యాప్తులోనే రిపోర్టు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం మారగానే టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వాదించారు.
మూడేళ్ల తర్వాత ఈ కేసులో లేనివారిని కొత్తగా నిందితులుగా చేరుస్తోందని ప్రస్తావించారు. 307 లాంటి హత్యయత్నం కేసులు పెట్టారని, కక్ష సాధింపు చర్యల నుంచి తమకు రక్షణ కల్పించాలని వైయస్సార్ సీపీ నేతల తరఫున వాదనలు వినిపించారు.
వైయస్సార్ సీపీ తరఫున న్యాయవాదులు చేసిన వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. నేతలకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి దర్యాప్తు సహకరించాలని నేతలకు సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇవీ చదవండి: YS Jagan: తప్పుడు సంప్రదాయాలు ఆపకుంటే మీకూ ఇదే గతి: వైయస్ జగన్ హెచ్చరిక
Ambati Rambabu: వైఫల్యాలు కప్పి పుచ్చడానికే బోట్ల పేరుతో చంద్రబాబు డ్రామా
Chandrababu Naidu: వైయస్ జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు
Telangana: వరద బాధితుల కోసం సినీ నటి రూ.50 లక్షల విరాళం
YS Jagan: రేపు గుంటూరులో వైయస్ జగన్ పర్యటన
