HomeAndhra PradeshAkhila Priya: చెప్పినట్టుగానే చేస్తున్న అఖిలప్రియ.. వైసీపీ నేతల ఆస్తులు ధ్వంసం

Akhila Priya: చెప్పినట్టుగానే చేస్తున్న అఖిలప్రియ.. వైసీపీ నేతల ఆస్తులు ధ్వంసం

Akhila Priya: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తనకూ ఓ రెడ్ బుక్ ఉందని నిన్ననే ప్రకటించిన సంగతి తెలిసిందే. తన వల్ల వంద మంది ఇబ్బంది పడబోతున్నారని, తాను మంచిదానిగా మారిపోయి వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారామె. తాజాగా ఇవాళ వైసీపీ నేతలకు చెందిన ఆస్తులను ఆమె అనుచరులు ధ్వంసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఆళ్లగడ్డకు చెందిన మధు వైసీపీలో చురుగ్గా ఉన్నాడన్న కారణంతో అతని ఫ్యాక్టరీ ఎస్‌ఎంఆర్‌ స్పన్‌ పైప్స్‌ గోడను కూల్చివేశారని బాధితులు చెప్పారు. ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రహరీ నిర్మాణంపై హైకోర్టు ఆదేశాలతో మరోసారి కొలతలు తీయాలని స్ధానిక రెవెన్యూ అధికారులకు అర్జీ ఇచ్చినా, ఎలాంటి కొలతలు వేయకుండా స్ధానిక ఎమ్మార్వో, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ప్రహరీ కూల్చివేశారని బాధితులు తెలిపారు. ఎమ్మెల్యే అఖిలప్రియ ఒత్తిడితో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ఈ ఘటనపై తగు విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకోవాలని మధు కోరారు.

ఇవీ చదవండి: Akhila Priya: నాకూ ఓ రెడ్ బుక్.. 100 మంది ఇబ్బంది పడతారు: అఖిల ప్రియ
Koneti Adimulam: టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు
Vinayaka Chaviti: తెలుగు వారికి వైయస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు
YS Jagan: వైయస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడికి జగన్‌ పరామర్శ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు